For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంత

  |

  టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ అండ్ గ్లామరస్ క్వీన్ సమంత రూత్ ప్రభు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను చాలా ఏళ్లుగా ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సమంత 'యశోద' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో చూడండి!

  యశోదగా ఎంట్రీ ఇచ్చిన సమంత

  యశోదగా ఎంట్రీ ఇచ్చిన సమంత

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'యశోద'. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. దీన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

  అలాంటి స్టోరీతో వచ్చిన యశోద

  అలాంటి స్టోరీతో వచ్చిన యశోద

  సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్న హీరోయిన్‌కు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. దీంతో ఆమె కొందరిపై వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకుంటుంది. దీంతో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ పోరాటంలో విజయం సాధించిందా? అనే అంశాలతో 'యశోద' మూవీ తెరకెక్కింది. ఈ సినిమా థ్రిల్లర్‌ జోనర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందింది.

  ట్విట్టర్‌లో మూవీకి అలాంటి టాక్

  ట్విట్టర్‌లో మూవీకి అలాంటి టాక్

  సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. 'యశోద' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా డీసెంట్‌గా ఉందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  ఫస్టాఫ్ డీసెంట్‌గానే ఉందంటూ

  సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీని వీక్షించిన చాలా మంది ప్రేక్షకులు ఫస్టాఫ్ చాలా డీసెంట్‌గా ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో 'ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బాగున్నాయి. సెకెండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించే విధంగా మంచిగా సెట్ చేసి పెట్టారు' అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

  యశోద సెకెండాఫ్ అలా ఉందట

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీని చూసిన మరో నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అందులో 'యశోద మూవీ ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా ఉంది. సెకెండాఫ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా సాగింది. మొత్తంగా ఇది డీసెంట్ మూవీ. మణి శర్మ సంగీతం సూపర్‌గా ఉంది. సమంత బాగా చేసింది' అని చెప్పుకొచ్చాడు.

  సమంత సినిమా ప్లస్‌ మైనస్‌లు

  టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీ ప్లస్‌లు, మైనస్‌ల గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అందులో సమంత యాక్టింగ్, నటీనటుల ఎంపిక, కాన్సెప్ట్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, రన్ టైమ్ ఈ సినిమాకు ప్లస్ అని వెల్లడించాడు. ఇక, మొదటి ఇరవై నిమిషాలు, కొంత ల్యాగ్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయని సదరు నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

  మొత్తంగా సినిమా ఎలా ఉంది?

  సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీపై మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. అందులో 'యశోద సినిమా డీసెంట్‌గా తీసిన ఎమోషనల్ థ్రిల్లర్. ఈ సినిమాకు సమంత ప్రాణం పోసింది. మిగిలిన నటీనటులూ మంచిగా నటించారు. మణి శర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కాన్సెప్ట్, విజువల్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. దీనికి రేటింగ్ 3' అంటూ చెప్పుకొచ్చాడు.

  సమంత యాక్షన్ సీక్వెన్స్ హైలైట్

  'యశోద' మూవీని చూసిన వాళ్లందరూ ఇందులో సమంత చేసిన నటన, యాక్షన్, పండించిన ఎమోషన్స్ గురించే మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె అదిరిపోయే ఫైటింగ్స్ చేసిందని ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. అలా సినిమా మొత్తం తనదైన నటనతో ప్రాణం పోసిందని చెబుతున్నారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  సమంత హెల్త్ ఇష్యూ గురించి

  'యశోద' మూవీలో సమంత నటన చూసిన వాళ్లంతా ఆమె హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు 'సమంత అనారోగ్యంతో ఉన్నా ఈ సినిమా కోసం పని చేసిందని తెలిసింది. అందుకు తగ్గట్లుగానే ఆమె అదిరిపోయే నటనతో అద్భుతమైన సినిమాను అందించింది. సమంత సూపర్' అంటూ ట్వీట్లు చేస్తూ ఆమె కోలుకోవాలని కోరుతున్నారు.

  English summary
  Samantha Ruth Prabhu Did Yashoda Movie Under Hari and Harish direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X