»   » 1.63 లక్షల లైకులట వామ్మో..! సమంతా చీర ఇలా తయారయ్యింది.... (వీడియో)

1.63 లక్షల లైకులట వామ్మో..! సమంతా చీర ఇలా తయారయ్యింది.... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సమంత ల నిశ్చితార్ధం ఆదివారం హైదరాబాద్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది నిశ్చితార్థం. ఈ ఫంక్షన్‌లో సమంత కట్టుకున్నచీర స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు రంగు చీరలో సమంతా ఈ వేడుకలో తళతళ మెరిసిపోయింది. ముంబైకి చెందిన పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌ క్రేషా బజాజ్‌ ఈ చీరను డిజైన్ చేశారు.

ప్రత్యేక ఆకర్షణ మాత్రం సమంతనే. సమంత కట్టుకున్న ఆ చీరే. ఎందుకంటే.. ఆ చీరపై చైతూ సమంతకు పరిచయమై, వారి పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ వివాహ బంధంగా మారే వరకు జరిగిన పరిణామాలన్నీ ఆ చీరపై ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సమంతా కట్టుకున్న చీర అంచును జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది.

ఆ చీరలో ఏముందో! సమంత, చైతన్య కలిసి దిగిన ఫొటోలు, వారి ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలు, మొన్న జరిగిన అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటోలు అన్నీ సమంత కట్టుకున్న చీరలో డిజైన్ చేసి ఉన్నాయి. 'ఏం మాయ చేశావే', 'ఆటోనగర్ సూర్య' , 'మనం' సినిమాల్లో ఉన్న నాగచైతన్య- సమంతాల క్యూట్ స్టిల్స్‌.. ఇద్దరూ పర్సనల్ గా ఎంజాయ్ చేసిన బ్యూటీపుల్ మూమెంట్స్ .. ఇలా అన్నీ మంచి ఆర్ట్‌వర్క్‌తో కనిపించేలా ఈ చీర అంచును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. బైక్‌పై నాగచైతన్య, సమంత వెళుతున్న ఆర్ట్‌వర్క్‌ కూడా ఈ చీరలో కనిపిస్తుంది. ఇంకాస్త, క్లారిటీగా చెప్పాలంటే, ఈ చీర అంచుపై తమ లవ్‌స్టోరీలోని ప్రీషియస్‌ మూమెంట్స్‌ను సమంతా ఏరికోరి డిజైన్ చేయించుకుంది.


ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ ఈ చీరను డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్ క్రెషా బజాజ్ ఆ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. వాస్తవానికి క్రెషా బజాజ్.. తన పెళ్లికి ఇలాగే చీరను డిజైన్ చేసుకుంది. ఆ డిజైన్‌నే సమంత ఎంగేజ్‌మెంట్‌కు కూడా చేసింది క్రెషా బజాజ్. ఇప్పుడు ఆ చీర మేకింగ్ వీడియోను సమంత వారం రోజుల క్రితం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఫేస్‌బుక్‌లో ఆ వీడియోకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1.63 లక్షల మంది లైక్ కొడితే.. 16,508 మంది ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను మరి మీరూ చూసేయండి.

    English summary
    The saree Making viedeo Samantha Ruth Prabhu wore for her engagement with Naga Chaitanya was very special.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu