For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హ్యాట్సాఫ్ సమంతా....! ఆ చిన్నారి జీవితం లో వెలుగు నింపింది

  |

  సమంతా.... ఈ పేరు గుర్తుకు రాగానే సన్నని నడుముతో వయ్యారంగా నడిచే ఒక అందగత్తే మాత్రమే మనకు గుర్తొస్తుంది. కానీ కనిపించే ఈ అందమైన రూపం కాక మరింత అందమైన మనస్సుకూడా ఉంది. ఈ జనం డబ్బుతో ఆస్తులు కూడగట్టుకొని ఊరేగే ఎందరో హీరోలకూ..., కోట్లు వెనకేసుకునే నటీమణులకూ లేని అద్బుతమైన మనస్సు ఉంది ఈ అమ్మాయికి. హీరోయిన్‌ అయిన తొలి నాళ్ల నుంచే ఆమె గొప్ప దతృత్వ గుణం చూపిస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో ఓ స్వఛంద సంస్థ ఏర్పాటు చేసి.. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ప్రచారం కోసం హడావుడి చేయడం కాకుండా.. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఎందరో అభాగ్యులైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది సమంత.

  సమాజం పట్ల భాద్యతగా ఉండటం ఎవరో నేర్పితే వచ్చేది కాదు... మనకంటూ ఒక జీవితాన్ని నిలబెట్టుకోవటానికి మన చుట్టూ ఉన్న మనుషులే ఎంతో ఇస్తారు. ముఖ్యంగా సినీ నటులకు ఒక స్టార్డం రావటానికి ఇప్పుడు వారనుభవించే కోట్లరూపాయల సమొపదలకూ మూలం వారి నటనని మెచ్చుకుంటూ తమవంతుగా ఇచ్చే నజరానా ఒక టికెట్టు కోసం పెట్టే ఖర్చు. తలా కొంత కలిపి తమని ఆనందపెట్టే నటులకోసం ఇస్తాడు ఒక సామాన్యుడు. మరి వారిపట్ల కృతఙ్ఞ్తగా ఉండే అవసరం ఉండాలి అని గట్టిగా అన్లేం కానీ అలా ఉండటం మాత్రం కొందరికే సాధ్యం.... తాజాగా సమంతా చేసిన మరో పని గురించి వింటే "హ్యాట్సాఫ్ సమంతా" అనకుండా ఉండలేం... ఒక చిన్నారి జీవితం లో నవ్వులు నింపేందుకు సమంతా చేసిన ఈ పనిని మీరే చూడండి....

  ఫౌండేషన్ స్థాపించి

  ఫౌండేషన్ స్థాపించి

  ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సంస్థ తరపున అభాగ్యులైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది సమంత.

  కృత్రిమ కాలు

  కృత్రిమ కాలు

  ఓ ప్రమాదంలో కాలు కోల్పోయిన చిన్నారికి మళ్లీ నడిచే భాగ్యం కల్పించింది సమంత. ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా భవాని అనే ఐదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలు అమర్చారు.

  మ్యాక్స్ కూర్ హాస్పిటల్

  మ్యాక్స్ కూర్ హాస్పిటల్

  రీసెంట్ గా హైదరాబాద్ లోని మ్యాక్స్ కూర్ హాస్పిటల్లో ఉన్న భవాని ని కలిసిన సమంతా ఆమె కోసం కృత్రిమ కాలు అమర్చటానికి అన్ని ఏర్పాట్లూ చేయించేసింది.

  డాక్టర్ మంజుల

  డాక్టర్ మంజుల

  మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో ఈ శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేశారు.డాక్టర్ మంజుల ఈ ఆపరేషన్లో పాల్గొని ఈ శస్త్ర చికిత్సను పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

  ఉచితంగాఅనేక ఆపరేషన్స్

  ఉచితంగాఅనేక ఆపరేషన్స్

  డాక్టర్ మంజుల స్వతహాగా కూడా గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె అనేక ఆపరేషన్స్ ను ఉచితంగా నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

  మొదటి సారి కాదు

  మొదటి సారి కాదు

  సమంతా ఇలా చేయటం ఇదే మొదటి సారి కాదు గత కొన్నేళ్ళుగా కొన్ని కోట్ల రూపాయలని సొంతంగానూ మరికొన్నిటిని విరాళాల రూపం లోనూ వాడుకుంటూ ఎందరికో సహాయం చేస్తోంది.

  విదేశాల్లో

  విదేశాల్లో

  ఈ సంస్థ కోసం విదేశాల్లో స్టేజ్ షోలు చేయటానికీ సిద్దపడింది. ఈ స్టేజ్ షోలలో వచ్చే ఒక్క రూపాయి కూడా తనకోసం కాదు. ప్రత్యూష ఫౌండేషన్ కోసమే.

  నాగచైతన్య

  నాగచైతన్య

  ఈ మంచి పనులన్నీ చూసాక అయినా ఆమె తమ ఇంటి కోడలు కాబోతున్నందుకు సంతోషంగానే ఫీలౌతున్నడేమో... ఇక నాగచైతన్య సంగతి వేరే చెప్పాలా

  హ్యాట్సాఫ్‌ సమంతా

  హ్యాట్సాఫ్‌ సమంతా

  వందల కోట్లు సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం. ఇలా సంపాదనలో కొంత భాగం అభాగ్యుల కోసం ఖర్చు చేయడంలో ఉన్నసంతృప్తి ఏంటో సమంతకే తెలుసు. ఆమె గొప్ప మనసుకు మరోసారి హ్యాట్సాఫ్‌ చెబుదాం.

  English summary
  Samantha meets J.C.G Bhavani 5yr old girl who lost her left leg in a road accident when she was 1yr old. Chandini was recently admitted to MaxCure Hospitals in Hyderabad for a disarticulation which enable her to walk using an artificial limb.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X