»   » చైతుతో ఆ విషయాలు మాట్లాడను.. అది నేర్చుకున్నా.. సమంత!

చైతుతో ఆ విషయాలు మాట్లాడను.. అది నేర్చుకున్నా.. సమంత!

Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సమంత గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సమంత రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించింది. సమంత ఇటీవల రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో సమంత అద్భుత నటన కనబరిచింది. పల్లె టూరి యువతిగా రామలక్ష్మి పాత్రలో సమంత ఆకట్టుకుంది.

చైతు, తాను మంచి పరిపక్వతతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని సమంత తెలిపింది. సినిమాకు సంబందించిన విషయాలు తాము మాట్లాడుకోమని సమంత తెలిపింది. తన చిత్రాల గురించి కథల గురించి చైతు తో చర్చించను. అతడు కూడా సినిమాకు సంబందించిన విషయాలు ఇంట్లో ప్రస్తావించడు అని సమంత తెలిపింది. ప్రొఫెషనల్ లైఫ్ కి సంబందించిన విషయాలు ఏవి తమ మధ్య చర్చకు రావని సమంత తెలిపింది.

Samantha says she doesnt discuss work with husband Naga Chaitanya

తాను చైతుని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని సమంత తెలిపింది. తన చిత్రాలు పరాజయం చెందితే గతంలో బాధపడే దాన్ని అని సమంత తెలిపింది. కానీ నాగచైతన్యని చూసాక తనలో మార్పు వచ్చిందని సమంత తెలిపింది. ఇప్పుడు తాను విజయం, పరాజయం రెండింటిని ఒకేలా చూస్తున్నానని సమంత తెలిపింది.

English summary
Samantha says she doesn't discuss work with husband Naga Chaitanya. Samantha learned a few things from her husband.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X