»   » అలీ చెత్త కామెంట్లపై సమంత సీరియస్ అయిందా?

అలీ చెత్త కామెంట్లపై సమంత సీరియస్ అయిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో కమెడియన్ అలీ సమంతపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆడియో ఫంక్షన్లలో సైతం కాస్త బూతు పదాలు మాట్లాడే అలవాటు ఉన్న అలీ ఈ సారి ఏకంగా సమంత నడుము మీద కామెంట్స్ చేసారు. సమంత నాభి భాగాన్ని విజయవాడ బెంజి సర్కిల్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసాడు.

సమంతను సౌందర్యరాశిగా పొగడ్తలు గుప్పించిన అలీ....తన చేతలతో నాభి భాగాన్ని చూపిస్తూ ‘ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం. బెంజిసర్కిల్ లా ఉంటుంది' అంటూ కామెంట్ చేసాడు. అలీ వ్యాఖ్యలపై అభిమానులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా సమంత కూడా ఫోన్ ద్వారా అలీ అక్షింతలు వేసినట్లు, తన గురించి మరోసారి అలా మాట్లాడితే బావుండదని గట్టిగా చెప్పినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

Samantha showed her displeasure

గతంలోనూ పలు ఆడియో వేడుకల్లో అలీ హీరోయిన్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే విమర్శలు ఉన్నాయి. అందం గురించి మాట్లాడటంలో తప్పులేదు కానీ....అలీ వ్యాఖ్యలు కాస్త జుగుప్సాకరంగా ఉండటమే ఈ అభ్యంతరాలకు ముఖ్య కారణం. అభిమానులకు, ప్రేక్షకులకు వెగటుపుట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

ఇక సమంత, అలీ కలిసి నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం రేపు (ఏప్రిల్ 9) గ్రాండ్ గా విడుదలవుతోంది. నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    According to the latest reports, it is heard that even though Samantha did not attend the event, she reportedly called Ali through phone and she showed her displeasure for the double meaning comments.
    Please Wait while comments are loading...