»   » సమంతకే అగ్రతాంబూలం (ఫోటో ఫీచర్)

సమంతకే అగ్రతాంబూలం (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వన్ ఇండియా పాఠకులు హీరోయిన్ సమంతకు అగ్ర తాంబూలం అందించారు. 2013 సంవత్సరంలో బెస్ట్ హీరోయిన్ ఎవరు? అనే అంశంపై వన్ ఇండియా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలో సమంతకు అత్యధిక ఓట్లు పడ్డాయి. టాప్ 5 లిస్టులో సమంత తర్వాత అనుష్క, కాజల్, నందిత, శృతి హాసన్ చోటు దక్కించుకున్నారు. రీచా గంగోపాధ్యాయ్‌కు 6వ స్థానం దక్కింది.

ఈ ఓటింగులో మొత్తం 6137 మంది రీడర్స్ పాల్గొన్నారు. తమ తమ ఫేవరెట్ హీరోయిన్లకు ఓటేసారు. అత్తారింటికి దారేది చిత్రం హీరోయిన్ సమంతకు అత్యధిక ఓట్లు పడ్డాయి. టాప్ 5 లిస్టులో చోటు దక్కించుకున్న హీరోయిన్లు, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు స్లైడ్ షోలో చూద్దాం....

సమంత

సమంత


అత్తారంటికి దారేది చిత్రానికి గాను సమంతను వన్ ఇండియా రీడర్లు బెస్ట్ హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆమెకు మొత్తం ఓట్లలో దాదాపు 50% శాతం ఓట్లు పడ్డాయి. 2944 మంది ఆమెకు ఓట్ వేసారు.

అనుష్క

అనుష్క


హీరోయిన్ అనుష్కకు వన్ ఇండియా రీడర్లు 2వ స్థానం కట్టబెట్టారు. గత సంవత్సరం మిర్చి, బ్యాడ్ బాయ్, వర్ణ చిత్రాల్లో నటించిన అనుష్కకు 1171 ఓట్లు పడ్డాయి.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్


హీరోయిన్ కాజల్ అగర్వాల్ 3వ స్థానం దక్కించుకుంది. ఆమెకు మొత్తం 967 ఓట్లు పడ్డాయి. గత సంవత్సరం ఆమె తెలుగులో బాద్‌షా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

నందిత

నందిత


ప్రేమ కథా చిత్రం హీరోయిన్ నందితకు 4వ స్థానం దక్కింది. ఆమెకు వచ్చిన ఓట్ల సంఖ్య 611.

శృతి హాసన్

శృతి హాసన్


హీరోయిన్ శృతి హాసన్‌కు 5వ స్థానం దక్కింది. ఆమెకు ఇంతకంటే మెరుగైన స్థానం లభిస్తుందని ఆశించాం...కానీ కేవలం 379 మంది మాత్రమే ఆమెకు ఓట్ చేసారు.

English summary
Samantha has been voted the Best Telugu actress of 2013 in the poll conducted by Oneindia. Along with Sam, Anushka Shetty, Kajal Aggarwal, Nanditha, Shruti Hassan Richa Gangopadhyay were nominated in this survey and 6137 readers have cast votes for their favourite actresses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu