»   » తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానంటున్న: సమంత

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానంటున్న: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె' సినిమాలో తన మేజిక్ బ్యుటీతో కుర్రాళ్లను మాయ చేసి, తన అభిమానులుగా చేసుకున్న సమంతా, ఇప్పుడు డబ్బింగ్ మీద కూడా దృష్టి పెడుతోందట. తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని కృషి చేస్తోంది. ఇందుకోసం, ముందు తెలుగు భాష మీద పట్టు సంపాదించుకుంటున్నట్టు చెబుతోంది. ట్యూటర్ని పెట్టుకుని ట్రైనింగ్ కూడా తీసుకుంటోందట. 'మనకు మనం డబ్బింగ్ చెప్పుకుంటేనే పాత్రకు హండ్రడ్ పర్శేంట్ న్యాయం చేసిన వాళ్లం అవుతాం. అందుకని డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను" అంటోంది సమంతా.

అన్నట్టు, నిన్న ప్రకటించిన నంది అవార్డులలో 'ఏ మాయ చేసావె' సినిమాలోని తన అభినయానికి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చినందుకు సమంతా చాలా హ్యాపీగా వుంది. అయితే, సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అవార్డుల గురించీ, అభినందనల గురించీ అస్సలు ఆలోచించలేదనీ, జెస్సీ పాత్రకు న్యాయం చేకూర్చి, గౌతం మీనన్ తన మీదుంచిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టాలన్నదే ఆలోచించాననీ చెబుతోంది. మొత్తం మీద గౌతమ్ మీనన్ వలన అవార్డు వచ్చిందని, ఈ క్రెడిట్ ఆయకే దక్కుతుందని సమంతా అంటున్నారు. స్పెషల్ జ్యూరి నంది అవాడ్డు తనకు చాల స్పెషల్ గా ఉందని సమంతా మురిసిపోతుంది.

English summary
When asked samantha why are you learning telugu she said i am learning telugu to get much closer to the telugu people. Hope cute babe cum beautiful actress samantha gets much closer to the telugu people soon by taking in telugu with her sweet voice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu