»   » సమంత పెళ్ళి చీర, చైతూ అమ్మమ్మదే: రామానాయుడు సతీమణి చీరతోనే

సమంత పెళ్ళి చీర, చైతూ అమ్మమ్మదే: రామానాయుడు సతీమణి చీరతోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జరుగనుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ పెళ్లిని రెండు సంప్రదాయాల ప్రకారం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట క్రిస్టియన్ పద్దతిలో చర్చిలో, తరువాత తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట.

హిందూ, క్రైస్తవ ఆచారాల్లో

హిందూ, క్రైస్తవ ఆచారాల్లో

త్వరలోనే సమంత, నాగచైతన్య పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలసిందే. అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకు హిందూ, క్రైస్తవ ఆచారాల్లో అంగరంగవైభోగంగా వారి వివాహ వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత పెళ్లి గురించి, ఆమె పెళ్లి చీర గురించి ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది.

నాగచైతన్య అమ్మమ్మ చీర

నాగచైతన్య అమ్మమ్మ చీర

సమంత ఎంగేజ్‌మెంట్ చీరలను డిజైన్ చేసిన క్రిషా బజాజే, ఆమె పెళ్లి చీరలను కూడా డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె ఆ పనుల్లోనే బిజీగా ఉందట. అయితే, ఇక్కడే ఉంది అసలు విషయం. పెళ్లి సందర్భంగా నాగచైతన్య అమ్మమ్మ చీరను సమంత కట్టుకోబోతోందట. అంటే మూవీ మొఘల్ డి రామానాయుడు భార్య రాజేశ్వరిది దేవి చీరను సమంత పెళ్లి కోసం కట్టుకుంటోందట.

Oct 6th: naga chaitanya and samantha marriage date finalized
బంగారు జరీ అంచుతో వర్క్

బంగారు జరీ అంచుతో వర్క్

ఆ పాత చీరపై బంగారు జరీ అంచుతో వర్క్ చేసి సరికొత్తగా ఆవిష్కరించేందుకు క్రిషా బజాజ్ చాలా వర్క్ చేస్తోంది. గతంలో సమంత ఎంగేజ్మెంట్ చీర విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డిజైన్ చేయించారు. అలాగే పెళ్లి నగలను కూడా ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలపై అక్కినేని కుటుంబ సభ్యులు స్పందించకపోయినా.. ఫిలిం సర్కిల్స్ లో సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

నిశ్చితార్దానికి

నిశ్చితార్దానికి

గతం లో సమంత తన నిశ్చితార్దానికి తెలుపు, బంగాను వర్ణంతో కూడాని సారీని ధరించగా దానిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ సమంత, చై ప్రేమ కథను తెలియజేసింది. సమంత క్లోజ్ ఫ్రెండ్ మరియు పాపులర్ డిజైనర్ నీరజ కోన ద్వారా.. ముంబయ్ డిజైనర్ క్రెషా భజాజ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన చీరని తయారు చేయించుకుంది సమంత.

సిల్క్ చీరపై జర్దోసి వర్క్ ద్వారా

సిల్క్ చీరపై జర్దోసి వర్క్ ద్వారా

ఈ ఎంబ్రాయిడరీ వర్క్ లో సమంత, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఏ మాయ చేశావేలోని ఓ స్టిల్ తో పాటు చైన్ గిఫ్ట్ గా ఇచ్చిన రింగ్ సాక్షిగా బీచ్ నుండి నాగ చైతన్య నడుచుకుంటూ వస్తున్న ఫోటో, అఖిల్ ఎంగేజ్ మెంట్ లో నాగ్ తన కొడుకు కోడళ్ళతో దిగిన గ్రూప్ ఫోటో లు కనిపించాయి. సిల్క్ చీరపై జర్దోసి వర్క్ ద్వారా బంగారు జెరీలో చెక్కిన చీర అంచు నిశ్చితార్ధంకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ అమ్మమ్మ చీర కూడా అంతే వార్తల్లోకె ఎక్కేలా డిజైన్ చేస్తున్నారట.

English summary
The bride Samatha will wear a special South Indian woven sari that was owned and adorned by the groom Naga chaithanya's grandmother, D Rajeswari, the wife of legendary filmmaker D Ramanaidu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu