బద్రినాథ్ దెబ్బకి బన్నీ లవర్ గా సమంతా ఒప్పుకొంటుందా..?
ఇటీవల రిలీజ్ అయిన బద్రీనాథ్ సినిమా తన ఇమేజ్ ను ఎక్కడికో తీసుకుపోతుందని ఆశలు పెట్టుకున అల్లు అర్జున్ ఆ సినిమా కాస్తా ఫ్లాప్ అవడంతో, తన తదుపరి సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే, కథ విషయంలో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదని అందరికీ తెగేసి చెప్పేస్తున్నాడట. ప్రేమ, కుటుంబ నేపద్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతం దిల్ రాజ్ తనతో నిర్మించనున్న చిత్రం విషయంలో కూడా స్క్రిప్ట్ ఇంకా బాగా చేయమని చెపుతున్నాడని అంటున్నారు. వాసూ వర్మ దర్శకత్వం వహించే ఈ చిత్రం పేరు 'లవర్'. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంతాని ఎంపిక చేయమని అర్జున్ సజెస్ట్ చేశాడట. ప్రస్తుతం ఆమెను బుక్ చేసే పనిలో వున్నాడు నిర్మాత దిల్ రాజు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం సమంత మహేష్ బాబు దూకుడు, రాజమౌళిలో డైరెక్షన్ 'ఈగ"తో బిజీగా వున్నవిషయం తెలిసిందే. బన్నీ ఈ చిత్రం తో పాటు త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ ఆ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











