twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు: సమంత

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ తో,మహేష్ తో సినిమాలు చేసిన సమంతకు వారిద్దరితో మంచి రిలేషన్ ఉంది. దాంతో ఆమె తన ప్రత్యూష ఫౌండేషన్ కు వారి నుంచి హెల్ప్ తీసుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ గురించి తెలుసుకొని మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ చాలా సంతోషించారు. కథానాయకుల దుస్తుల్ని వేలం వేసి, ఆ డబ్బుతో ఫౌండేషన్‌కి ధన సహాయం చేయాలనేది నా ఆలోచన. వెంటనే పవన్‌, మహేష్‌ స్పందించారు. పవన్‌ తన 'గబ్బర్‌ సింగ్‌' దుస్తుల్ని ఇచ్చారు. మహేష్‌ అప్పటికి లండన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి 'దూకుడు' దుస్తులు నాకు అందేలా చూశారు. నిజం చెప్పాలంటే నా తోటి హీరోయిన్స్ కూడా ఇంతలా స్పందించలేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత.

    ఇప్పుడు నేను సెలబ్రెటీని. ఏం మాట్లాడినా విలువ ఉంటుంది. అందుకే మంచి మాటలు మాట్లాడాలి. మంచి పనులు చేయాలి. ట్విట్టర్‌లో మూడు లక్షల మంది నన్ను అనుసరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది సమంత.

    మధ్యతరగతి జీవితం నుంచి వచ్చింది కదా... ఒదిగి ఉండడం ఎలాగో కూడా నేర్చుకొంది. ఇంతిచ్చిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకొంది. అందుకే సినిమాలతో పాటు సామాజిక సేవకూ సమయం కేటాయిస్తోంది. ఈ ఏడాది సమంతకు బాగానే కలిసొచ్చింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' సినిమాలతో విజయాలు దక్కించుకొంది. 'రామయ్యా వస్తావయ్యా'లో ఆకర్ష పాత్రతో ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా మీడియా తో సమంత ప్రత్యేకంగా మాట్లాడింది.


    కొన్ని ప్రశ్నలకు సమంత చెప్పిన జవాబులు.. స్లైడ్ షోలో...

    సినిమా హిట్ లో, రికార్డుల్లో హీరోయిన్ పాత్ర

    సినిమా హిట్ లో, రికార్డుల్లో హీరోయిన్ పాత్ర


    తప్పకుండా హీరోయిన్స్ పాత్ర ఉంటుంది. లేకపోతే నన్నే ఎందుకు హీరోయిన్ గా ఎంచుకోవాలి? ఎందుకు ఇంతింత పారితోషికాలు ఇవ్వాలి? ఎవరినైనా చూస్తారనుకొన్నప్పుడు... ఎవరు నటించినా పెద్దగా తేడా లేదనుకొన్నప్పుడు కొత్తమ్మాయిల్ని హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా?

    వరుసగా స్టార్ హీరోల సినిమాలకే సమంత వీటికే పరిమితమా?

    వరుసగా స్టార్ హీరోల సినిమాలకే సమంత వీటికే పరిమితమా?


    నేను అంతకు ముందు చిన్న సినిమాలు చేశా. 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమా కోసం చాలా కష్టపడ్డా. అయితే ఆ సినిమాకి అంత ఆదరణ లభించ లేదు. చిన్న సినిమాలు చేసినప్పడు 'ఏంటీ సమంత మరీ చిన్న సినిమాలే చేస్తోంది' అంటారు. కాస్త ప్రయోగాల కోసం ప్రయత్నిస్తే 'సమంత గ్లామర్‌ పాత్రలకు దూరమైపోతుందా, పెద్ద హీరోల పక్కన సరిపోదా?' అంటారు. ఏ అభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనేది నాకు అర్థం కావడం లేదు. ఒక ఏడాది పూర్తిగా కమర్షియల్‌ సినిమాలు చేస్తా. మరో ఏడాది చిన్న సినిమాలకు కేటాయిస్తా. హిట్‌ అవ్వకపోయినా ఫర్లేదు. చిన్న సినిమాలు మాత్రం వదిలిపెట్టను. నా నటన గురించి మంచి సమీక్షలు వస్తే చాలు.

    ప్రేమలో ఉన్నా...

    ప్రేమలో ఉన్నా...

    నేనిప్పుడు ప్రేమలోనే ఉన్నాను. ఉంటాను. పెళ్లయ్యాక కూడా ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఏమైనా అనుకుంటే నెరవేరే దాకా నిద్రపోను. అందుకే నా ప్రేమలో బ్రేక్‌లుండవు. ఇంకో కొన్నేళ్ల దాకా పెళ్లి చేసుకోదలచుకోలేదు. నాకింకా పెళ్లి కాలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే చెప్పే చేసుకుంటాను. ఈ రంగంలో ఎవరికైనా అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. షూటింగ్ ప్యాకప్ అయ్యాక నేను నటిగా ఫీల్ కాను. నేను, నా ఫ్యామిలీ అనుకుంటాను. సరిగా నాలాగే ఆలోచించే వ్యక్తి నాకు తారసపడ్డారు. నా జీవితంలో అప్ అండ్ డౌన్స్‌లో అతనున్నాడు. తోడున్నాడు. అంతకన్నా ఆనందం ఏముంది? నేనేం దాచట్లేదు. అబద్ధాలు చెప్పట్లేదు. నేను ప్రేమలో పడ్డానని, పెళ్లి కాలేదని నిజమే చెప్తున్నాను. అయితే అతనెవరో ప్రస్తుతానికి చెప్పను. సస్పెన్స్.

    కమర్షియల్‌ సినిమాల లలో హీరోయిన్స్ కష్టం...

    కమర్షియల్‌ సినిమాల లలో హీరోయిన్స్ కష్టం...


    'ఎటో వెళ్లిపోయింది మనసు' మూడు భాషల్లో చేశా. అందులో భావోద్వేగభరితమైన సన్నివేశాలుంటాయి. చాలా సన్నివేశాల్లో గ్లిజరిన్‌ అవసరం లేకుండా కన్నీళ్లు తెప్పించాలి. అలాంటప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 'అత్తారింటికి దారేది', 'రామయ్యా వస్తావయ్యా' లాంటి సినిమాలకు ఇంత ఒత్తిడి లేదు. ఎందుకంటే పెద్ద సినిమాలకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకొంటారు. సినిమా ఎక్కువగా హీరోపై నడుస్తుంటుంది. స్టార్‌ ఇమేజ్‌ బాగా కలిసొస్తుంది.

    'రామయ్యా.. వస్తావయ్యా' గురించి...

    'రామయ్యా.. వస్తావయ్యా' గురించి...



    ఎన్టీఆర్‌తో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. అంతేకాదు.. తెరపై నేను చాలా అందంగా కనిపించా.దుస్తులు, అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. పక్కా కమర్షియల్‌ చిత్రమిది. పైగా ఇద్దరు కథానాయికలున్నారు. ఇద్దరుంటే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది కదా.

    ఇన్ సెక్యూరిటీ ఫీలయ్యా...

    ఇన్ సెక్యూరిటీ ఫీలయ్యా...


    చాలాసార్లు ఫీలియ్యా. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. రాత్రికి రాత్రే స్టార్‌లు అయిపోతారు. ఓస్టార్‌.. కిందకు పడిపోవడానికీ ఎంతో సేపు పట్టదు. ఎవరు ఎప్పుడు ఫేడ్‌ అవుట్‌ అవుతారో చెప్పలేం. ప్రతి శుక్రవారం సినిమా జనాల జాతకాలు మారిపోతుంటాయి. నేను సరైన దారిలోనే వెళ్తున్నానా? లేదా? నా సినిమాలు ఎలా ఆడుతున్నాయి? అనే భయాలు ఎప్పుడూ ఉంటాయి.

    గ్యాప్ వచ్చినప్పుడు...

    గ్యాప్ వచ్చినప్పుడు...

    ఆ మధ్య మూడు నెలలు సినిమాలకు దూరమయ్యారు. మీ వల్ల కొన్ని సినిమాలు ఆగిపోయాయి. 'మళ్లీ సినిమాల్లోకి వస్తానా?' అనే భయం ఉండేదా?
    నేను త్వరగా కోలుకొంటే చాలు.. అనుకొన్నానంతే. సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం అది. ఆ విరామం వృత్తిగతంగా వ్యక్తిగతంగా చాలా ఉపయోగపడింది. అయితే నా వల్ల సినిమాలేం ఆగిపోలేదు. ఆ సమయంలో 'కడలి' సినిమా మాత్రమే ఒప్పుకొన్నా. అందులోంచి తప్పుకోవాల్సివచ్చింది.

    సమాజ సేవ వైపు...

    సమాజ సేవ వైపు...


    అసలు సమాజ సేవ వైపు మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు చెప్పాలంటే... ఆరోగ్య సమస్యల వల్ల మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకొన్నా. ఆ సమయంలో అందరూ నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అసలు నాకు సంబంధమే లేని వ్యక్తులు నా గురించి ప్రార్థనలు చేశారు. అసలు వాళ్లెందుకు నాపై ప్రేమ చూపించాలి అనిపించింది. వాటితో పోలిస్తే నేను చేస్తోంది చాలా తక్కువ.

    నేను చదివే పుస్తకాలు...

    నేను చదివే పుస్తకాలు...


    ''నేను ఎక్కువ పుస్తకాలు చదువుతా. అయితే పేజీలు తిప్పుతూ చదివితే బుర్రకి ఎక్కదు. అందుకే ఆడియో బుక్స్‌ వింటా. ఈ మధ్య 'మై నేమ్‌ ఈజ్‌ మలాలా' పుస్తకం చదివా. నిజంగా ఆమె జీవితం ఎంతో స్ఫూర్తినిచ్చింది. మలాలా వయసు పదహారేళ్లు మాత్రమే. కానీ ఆమె మాటతీరు చూస్తే ఎవరైనా విస్తుపోతారు. బాలికా విద్య గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి అనర్గళంగా మాట్లాడుతుంది. అంత చిన్న వయసులో ఎన్నో విపత్తులు ఎదుర్కొంది. బుల్లెట్‌ గాయాన్ని కూడా లెక్కచేయలేదు. ఇప్పటికీ ఆమె ప్రాణాలకు గ్యారెంటీ లేదు. నోబుల్‌ శాంతి బహుమతి బరిలో నిలిచింది. ఇంతకు మించిన స్ఫూర్తి ఇంకెక్కడి నుంచి వస్తుంది?''.

    ఆ రోజులు గుర్తున్నాయి...

    ఆ రోజులు గుర్తున్నాయి...


    ''మాది మధ్య తరగతి కుటుంబం. ఫైవ్ స్టార్ హోటల్‌, నగలు, వజ్రాలు అసలు ఇవేం తెలీవు. కనీసం వాటి గురించి చిన్నతంలో వినలేదు కూడా. అలాంటి స్థితి నుంచి వచ్చా. ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి. 'ఎవరైనా వచ్చి సహాయం చేస్తే ఎంత బాగుంటుంది?' అనుకొన్న సందర్భాలున్నాయి. ఇప్పుడు అలాంటి స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్లను నా వంతుగా ఆదుకోవాలి కదా? నేను ఇప్పుడు బాగా సంపాదించాను. తిరగడానికి కార్లున్నాయి. ఇవి చాలు. ఇంతకంటే ఏం కావాలి? ఏమీ లేనప్పుడే బతికాను. ఇప్పుడు బతకలేనా..? అయినా ఒక మనిషి ఇంత డబ్బు ఏం చేసుకొంటారు? అందుకే ప్రత్యూష లాంటి సంస్థలకు అండగా నిలబడ్డా''.

    శెలవు తీసుకుంటానంటూ చెప్పిన ట్వీట్స్ గురించి...

    శెలవు తీసుకుంటానంటూ చెప్పిన ట్వీట్స్ గురించి...

    కొన్నాళ్ల పాటు సినిమాలకు సినిమాలకు సంతకం చేయనని ట్విట్టర్‌లో పోస్ట్ చేసా... వచ్చే ఏడాది తమిళ్‌లో సినిమాలు చేస్తాను. హిందీకి వెళ్లే ఆలోచన లేదు.
    మలయాళం స్క్రిప్ట్‌లు కూడా వింటున్నాను. అతి తక్కువ బడ్జెట్‌లలో అక్కడ అద్భుతాలు చేస్తున్నారు. త్వరలో తెలుగులోనూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి అంది.

    'అత్తారింటికి దారేది' పైరసీ గురించి ...

    'అత్తారింటికి దారేది' పైరసీ గురించి ...

    ఆ టీమ్‌తో నాకు ఎక్కువ చనువుంది. ఏమడిగినా కాదనకుండా సినిమా బాగా రావాలని ప్రసాద్‌గారు కష్టపడ్డారు. అంత మంచి మనిషికి ఇలా ఎందుకు జరిగింది? అని బాధపడ్డాను. పైరసీ గురించి తెలిసినప్పుడు నేను అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో ఉన్నాను. కానీ ఆ సినిమా విషయంలో అభిమానులు, ప్రెస్, మీడియా, ఇండస్ట్రీ అందరూ ఏకమై పోరాడిన విధానం చూసి చలించిపోయాను.

    English summary
    Pratyusha Foundation is a Charity Organisation by Actress Samantha for Children and Women.. Samantha is Planning for an Auction to raise fund for the Organisation by her Costumes and from her co-stars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X