»   » 'గబ్బర్ సింగ్ - 2 ' గురించి సంపత్ నంది వివరణ

'గబ్బర్ సింగ్ - 2 ' గురించి సంపత్ నంది వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, సంపత్ నంది కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్ - 2 ' రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ విషయమై తొలిసారిగా సంపత్ నంది మీడియా ముందు పెదవి విప్పారు. ఆయన చిత్రం గురించి డిటేల్స్ ఇచ్చారు. బయిట ప్రచారం అవుతున్న రూమర్స్ ను ఖండిస్తూ వివరణ ఇచ్చారు.

సంపత్ నంది మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ ఛాయలతో సాగుతుంది పవన్‌కల్యాణ్‌తో చేయబోయే చిత్రం. అయితే ఇది 'దబాంగ్‌ 2'కి రీమేక్‌ మాత్రం కాదు. పూర్తిగా కొత్త కథ. గబ్బర్‌ సింగ్‌ అనేది నా దృష్టిలో ఓ బ్రాండ్‌. ఆ పాత్ర తీరుతెన్నులు, విధానం... అన్నీ ప్రత్యేకమే. వాటిని ఆధారంగా చేసుకొని ఎన్ని భాగాలైనా తీయొచ్చు. పవన్‌కల్యాణ్‌ అంతగా ఆ పాత్రకు జీవం పోశారు. గబ్బర్‌ సింగ్‌లో ఉన్నంత వినోదం, పంచ్‌ డైలాగులు, వాణిజ్యాంశాలు... ఇందులోనూ ఉంటాయి. ఆయన అభిమానుల్ని, ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచను'' అన్నారు.


అలాగే ''మనం అనుకున్న కథను స్టార్‌ హీరోలకు తగ్గ రీతిలో మలచుకోవాలి. రజనీకాంత్‌ సినిమాలకు వెళ్లాక ఆయన శైలి మేనరిజమ్స్‌, పంచ్‌లు లేకపోతే నిరుత్సాహపడతాం కదా. కాబట్టి అభిమానుల కోణంలోనూ ఆలోచించాలనుకొంటాను. అప్పుడు రచ్చ కావచ్చు... ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ సినిమాకైనా ఆ విధానంలోనే నా కథను తెరపైన చూపిస్తాను'' అన్నారు.

ఇక ...''రచ్చ సినిమాలోని టైటిల్‌ గీతం అంటే పవన్‌కల్యాణ్‌గారికి ఇష్టం. ఆ సినిమా విడుదలయ్యాక కళా దర్శకుడు ఆనంద్‌ సాయి ద్వారా కలిశాను. కథను మాస్‌కి నచ్చేలా చెప్పిన విధానం, పాటల చిత్రీకరణ నచ్చాయన్నారు. ఆయన ఆలోచనల్లోంచే మా చిత్ర కథ రూపుదిద్దుకొంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం, జయనన్‌ విన్సెంట్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తారు. ఇంకా హీరోయిన్ ఎవరనేది నిర్ణయం కాలేదు'' అని వివరించారు.

English summary
Sampath Nandi clarifies that Gabbar Singh-2 is not Dabaang-2 remake. He says that Gabbar singh is a brand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu