»   » రివ్యూలు దారుణంగా అనిపించాయి: దర్శకుడు సంపత్ నంది

రివ్యూలు దారుణంగా అనిపించాయి: దర్శకుడు సంపత్ నంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన 'గౌతమ్ నంద' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడి టేకింగ్ బావుందనే ప్రశంసలతో పాటు సినిమా కథ చాలా పాతగా ఉందనే విమర్శలు వచ్చాయి.

'గౌతమ్ నంద' చిత్రానికి రివ్యూలు నెగెటివ్‌ రావడంపై చిత్ర యూనిట్ స్పందించంది. రివ్యూ రిపోర్టులను చేధించుకుని బాక్సాఫీసు వద్ద తమ చిత్రానికి ప్రేక్షకాదరణ బావుందని అంటున్నారు దర్శక నిర్మాతలు. సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.

రివ్యూలు దారుణంగా ఉన్నయన్న సంపత్ నంది

రివ్యూలు దారుణంగా ఉన్నయన్న సంపత్ నంది

సక్సెస్ మీట్‌లో సంపత్ నంది మాట్లాడుతూ సినిమాపై క్రేజ్ ఉండటం వలన తాము పెద్దగా పబ్లిసిటీ చేయలేదనీ, రిలీజ్ అయిన తరువాత చూస్తే రివ్యూలు దారుణంగా అనిపించాయని తెలిపారు.

ప్రేక్షకులు సపోర్ట్ ఇచ్చారు

ప్రేక్షకులు సపోర్ట్ ఇచ్చారు

రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులు తమకు మంచి సపోర్ట్ ఇచ్చారని సంపత్ నంది అన్నారు. బాక్సాఫీసు వద్ద సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయని, తమ సినిమా సక్సెస్ అయిందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.

అభినందనలు

అభినందనలు

తన స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందించారని. తానెంతగానో ఇష్టపడే వాళ్లు నా కెరియర్లో ఇదే బెస్ట్ మూవీ అంటూ ప్రశంసించారని తెలిపారు. వారి ప్రశంసలు ఒక దర్శకుడిగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు.

విమర్శలు సహజం

విమర్శలు సహజం

ఏ సినిమాకు అయినా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తాయి. ఒక సినిమా అనేది ప్రతి ఒక్కరికీ నచ్చాలని ఏమీ ఉండదు. కొన్ని సినిమాలు కొందరికి నచ్చక పోవచ్చు. అదే సమయంలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నపుడు హిట్ అయినట్లే అని సంపత్ నంది అన్నారు.

English summary
Tollywood director Sampath Nandi about his latest release 'Goutham Nanda' negative reviews. He said that 'I don't care media reviews.'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu