»   » ‘హృదయ కాలేయం’ సంపూర్ణేష్ బాబు అరెస్ట్

‘హృదయ కాలేయం’ సంపూర్ణేష్ బాబు అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sampoornesh Babu
హైదరాబాద్ : టాలీవుడ్లో 'హృదయ కాలేయం' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంపూర్ణేష్ బాబును మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా బొటానికల్ గార్డెన్స్‌లో షూటింగ్ జరుపుతుండటంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనుమతి తీసుకున్న తర్వాత షూటింగ్ జరుపుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది.

'ఎ కిడ్నీ విత్ హార్ట్' అనే అర్థం పర్థంలేని సబ్ టైటిల్‌తో 'హృదయ కాలేయం' చిత్రం హీరో సంపూర్ణేష్ బాబు తనదైన రీతిలో సినిమాకు ప్రచారం కల్పిస్తూ...తొలి సినిమాతోనే ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. సంపూర్ణేష్ బాబు సినిమా ఫ్యామిలీ నుండి రాలేదు, అతని మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, హీరోలో ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటీ అతనిలో లేదు, కానీ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రేక్షకుల దృష్టినే కాదు....టాలీవుడ్ ప్రముఖుల దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

ఈ సినిమా కాన్సెప్టు విషయానికిస్తే.....చెత్త ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా ఉంటుంది అనే కోణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. సినిమా ప్రచారం కోసం ట్రైలర్ రూపంలో 'నేనే సంపూ ... ముద్దు పేరే తెగింపు' అనే సాంగ్‌ని కూడా వదిలాడు సంపూ.

అయితే తన పబ్లిసిటీ పెంచుకోవడానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు సంపూర్ణేష్. ఆ మధ్య 'పవనిజం' కాన్సెప్టును ఇమిటేట్ చేస్తూ 'సంపూర్ణిజం' జిందాబాద్ అంటూ లోగోలు వదిలాడు. రాజమౌళి లాంటి దర్శకులు సంపూర్ణేష్ గురించి సోషల్ నెట్వర్కింగులో వ్యాఖ్యలు చేయడం ఇతనికి పబ్లిసిటీ పెంచేసింది.

English summary
‘Hrudaya Kaleyam’ star sampoornesh babu was arrested by madhapur police for shooting in a botanical garden without the concerned person permission. A case was filed on the unit for allegedly shooting without any permission.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu