»   » పవన్ కళ్యాణ్ వల్లే.... 50 కిమీ దూరంలో బంధించారు: సంపూర్ణేష్ బాబు

పవన్ కళ్యాణ్ వల్లే.... 50 కిమీ దూరంలో బంధించారు: సంపూర్ణేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.... తన సినిమాలతోనే కాదు, తన సోషల్ యాక్టివిటీస్ తోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హుదూద్ తుపాన్ సమయంలో, ఏపీ స్పెషల్ స్టేటస్ పోరాట సమయంలో, ఇతర సందర్భాల్లో సంపూర్ణేష్ బాబు రియాక్ట్ అయిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

అయితే ఇవేవీ తాను పబ్లిసిటీ కోసం చేసానని అంతా అంటున్నారు. తాను పబ్లిసిటీ కోసం ఎప్పుడూ పాకులాడలేదు, ఏ పని చేసినా నిజాయితీగా చేసానని సంపూర్ణేష్ బాబు తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

డబ్బు లేకున్నా అప్పు చేసి ఇచ్చాను

డబ్బు లేకున్నా అప్పు చేసి ఇచ్చాను

హుదూద్ తుఫాన్ తర్వాత వైజాగ్ పరిస్థితి చూసి చలించి పోయాను. అందుకే ఏమీ ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాను. వాస్తవానికి అప్పుడు తన వద్ద అంత డబ్బు కూడా లేదు. అందుకే రెండు వారాల తర్వాత అప్పు చేసి ఆ డబ్బును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించానని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ఇన్ స్పైర్ అయ్యాను

పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ఇన్ స్పైర్ అయ్యాను

ఏపీ ప్రత్చేక హోదా కావాలని బలంగా కోరుకునే వారిలో నేనూ ఒకడిని. ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాలతో ఇన్ స్పైర్ అయ్యాను. అందుకే వైజగ్ జరిగే ఏపీ స్పెషల్ స్టేటస్ నిరసన దీక్షకు వస్తానని చెప్పాను, మాటకు కట్టుబడి అక్కడకు వెళ్లాను అని సంపూర్ణేష్ బాబు తెలిపాడు.

వైజాగ్‌కి 50 కిమి దూరంలో బంధించారు

వైజాగ్‌కి 50 కిమి దూరంలో బంధించారు

వైజాగ్ లో ఏపీ స్పెషల్ స్టేటస్ నిరసన దీక్షలో పాల్గొనడానికి వెల్లినపుడు వైజాగ్ ఎయిర్ పోర్టు వద్దే పోలీసులు నన్ను అడ్డుకున్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో బంధించి పెట్టారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ విమానం టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పినా వదల్లేదు. రాత్రి 7 గంటల సమయంలో విడిచి పెట్టారు. రాత్రి 10 గంటల ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చానని సంపూ తెలిపారు.

నన్ను క్షమించండీ..! మోసం చేసాను : సంపూ బాబు చెప్పిన నమ్మలేని నిజాలు

నన్ను క్షమించండీ..! మోసం చేసాను : సంపూ బాబు చెప్పిన నమ్మలేని నిజాలు

నన్ను క్షమించండీ..! మోసం చేసాను : సంపూ బాబు చెప్పిన నమ్మలేని నిజాలు..... పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి.

English summary
Sampoornesh Babu revealed his personal life details and professional life details in a recent interview.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu