For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bazar Rowdy Twitter Review: భారీ హిట్ తర్వాత బజార్‌ రౌడీగా సంపూ.. ప్లస్ మైనస్ ఇవే.. ఎలా ఉందంటే!

  |

  చాలా తక్కువ సమయంలోనే స్ఫూఫ్ సినిమాలు.. విచిత్రమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. 'హృదయ కాలేయం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రమైన పాత్రలతో విభిన్నమైన గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్‌లోనూ అవకాశాన్ని అందుకుని హాట్ టాపిక్ అయ్యాడు సంపూ. కామెడీ చిత్రాలనే కాకుండా.. సీరియస్ సినిమాలను సైతం చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'కొబ్బరి మట్ట' భారీ హిట్‌ను అందుకున్నాడు. దీని తర్వాత ఇప్పుడు 'బజార్ రౌడీ' అనే మూవీ చేశాడు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ మీ కోసం!

  ‘కొబ్బరి మట్ట'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

  ‘కొబ్బరి మట్ట'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజాగా నటించిన చిత్రం ‘కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్లూ భారీగా వచ్చాయి.

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  ‘బజార్ రౌడీ'గా సంపూర్ణేష్ బాబు రచ్చ

  ‘బజార్ రౌడీ'గా సంపూర్ణేష్ బాబు రచ్చ

  ‘కొబ్బరి మట్ట' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రమే ‘బజార్ రౌడీ'. వసంత నాగేశ్వరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఇందులో మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా చేసింది. సాయి కార్తీక్ దీనికి సంగీతం అందించింది. ఇది ఆగస్టు 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

  గ్రాండ్‌ రిలీజ్.. బిజినెస్ కూడా భారీగానే

  గ్రాండ్‌ రిలీజ్.. బిజినెస్ కూడా భారీగానే

  తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణేష్ బాబుకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘కొబ్బరి మట్ట' మూవీ తర్వాత అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే ‘బజార్ రౌడీ' సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో విడుదలవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది గ్రాండ్ రిలీజ్ అని చెప్పొచ్చు.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ
  https://telugu.filmibeat.com/heroine/heroine-sonal-chauhan-sizzling-in-glamorous-dress-102007.html

  ‘బజార్ రౌడీ' సినిమా నేపథ్యం ఏంటంటే

  ‘బజార్ రౌడీ' సినిమా నేపథ్యం ఏంటంటే

  ప్రమోషన్ కార్యక్రమాల్లో ‘బజార్ రౌడీ' సినిమా నేపథ్యాన్ని వెల్లడించాడు సంపూర్ణేష్ బాబు. చిన్న వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిన హీరో.. బజార్ రౌడీగా పెరుగుతాడు. అలా జాలీగా గడుపుతోన్న సమయంలో కొందరు తీసుకెళ్లి తన కుటుంబానికి కలుపుతారు. అప్పుడు తన ఫ్యామిలీ ఎదుర్కొంటోన్న కష్టాలను తెలుసుకుని వాటిని ఎలా పరిష్కరించాడనే సినిమా కథ.

  సంపూర్ణేష్ బాబు తొలిసారి అలాంటి రోల్

  సంపూర్ణేష్ బాబు తొలిసారి అలాంటి రోల్

  ఇప్పటి వరకూ విచిత్రమైన గెటప్‌లతో వైవిధ్యమైన సినిమాలు చేసిన సంపూర్ణేష్ బాబు.. ‘బజార్ రౌడీ'లో తొలిసారి ఎమోషనల్ పాత్రలో నటించాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీని పంచుతూ.. రెండో సగంలో మాత్రం ఫ్యామిలీ కోసం పోరాటం చేసే పాత్రలో అతడు రెండు షేడ్స్‌లో కనిపించాడు. ఈ రెండింటిలోనూ వేరియేషన్ చూపించడంతో పాటు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్

  సంపూ ‘బజార్ రౌడీ' మూవీ టాక్ ఇలా

  సంపూ ‘బజార్ రౌడీ' మూవీ టాక్ ఇలా

  సంపూర్ణేష్ బాబు నటించిన ‘బజార్ రౌడీ' సినిమా ఓవర్సీస్‌లో కూడా కొన్ని లొకేషన్స్‌లో విడుదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు పడ్డాయి. ఇక, దీన్ని చూసిన వారంతా ఈ చిత్రానికి మంచి స్పందననే అందిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు సినిమాలంటే సినిమా స్ఫూఫ్‌లతో సాగుతాయి. కానీ, ఇది మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని వీక్షకులు చెబుతున్నారు.

  Raja Raja Chora Movie Trailer | Filmibeat Telugu
  సినిమాలో ప్లస్.. మైనస్‌లు ఇవేనంటూ

  సినిమాలో ప్లస్.. మైనస్‌లు ఇవేనంటూ

  ‘బజార్ రౌడీ' సినిమాలో ప్లస్‌ల విషయానికి వస్తే.. సంపూర్ణేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ హైలైట్‌గా నిలిచిందట. అలాగే, సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక, మైనస్‌ల విషయానికి వస్తే.. కథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషనల్ సీన్స్ బాగా పండకపోవడం, స్క్రీన్‌ప్లేలో గందరగోళం ఫీల్‌ను కలిగించవని చెబుతున్నారు.

  English summary
  Tollywood Talented Hero Sampoornesh Babu Recently Did Bazar Rowdy Movie Under D. Vasantha Nageswara Rao. Check Here To Know Audience Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X