»   » సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సాంగ్

సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘హృదయ కాలేయం' సినిమాతో చెత్త సినిమా తీసిన చెత్త హీరోగా తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని విధంగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు త్వరలో ‘కొబ్బరి మట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగు కూడా విడుదల చేసారు. ఫన్నీ లిరిక్స్ తో సాగే ఆ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.


ఈ పాట విడుదల సందర్భంగా పిచ్చి కాన్సెప్టుతో ప్రచారం చేసారు. ఆ వివరాలు క్రింది విధంగా...


ఏప్రిల్ 15, 1947 తెల్లదొరల పాల నుండి భారతీయులు విడుదల అయిన వేళ.. ఏప్రిల్ 15, 2015 కొబ్బరి మట్ట పాట విడుదల అవుతున్న వేళ.. నా ప్రియమైన తెలుగు ప్రజలారా..నా తొలి చిత్రం ‘హృదయ కాలేయం'ని ఆదరించి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న భారతీయులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.


69 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 15న అమెరికన్ ల చెర నుండి బయట పడిన భరతమాతకి రుణంగా ఏమివ్వగలం...ఒక్క పాట తప్ప. ‘హృదయ కాలేయం' టీంతో మరోసారి పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా 3 పాత్రలతో మీ ముందుకు రాబోతున్నాను.


Sampoornesh Babu's Kobbari Matta Movie song

‘కొబ్బరి మట్ట' ఒక కుటుంబ కథా చిత్రం... నా దృష్టిలో కుటుంబం అంటే ఒక పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, ఇక పిల్లలు అంటే మన ఇష్టంతో కలుపుకునే కుడితి.... కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే మగ ఆవు. ఇలాంటి గొప్ప సెంటిమెంట్ కథా చిత్రంలో గుండెని హత్తుకునే ఒక పాటని మీ కోసం నేను స్వయంగా పాడాను...భారత స్వాతంత్ర్య ఫలాలని 68 సంవత్సరాలుగా ఆస్వాదించిన మీరు..ఈ చిత్ర గీత స్వరాలని అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను.... అంటూ ప్రకటన విడుదల చేసారు.


ఈ చిత్రానికి నిర్మాత: ఆది కుంభగిరి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: స్టీవెన్ శంకర్, కూర్పు : కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: జాషువ, సంగీతం: కమ్రన్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.

English summary
Sampoornesh Babu's Kobbari Matta Movie song released. Sampoornesh is not just actor, comedian, hero, villain and all, but he is also singer too. Today the first ever song he has sung for movie loves got released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu