»   » '1 నేనొక్కిడినే' ఎందుకు ఫ్లాపైందో ఇప్పటికీ అర్థం కాలేదు

'1 నేనొక్కిడినే' ఎందుకు ఫ్లాపైందో ఇప్పటికీ అర్థం కాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sandeep Kisan about Maheh's '1' flop
  హైదరాబాద్ : '1' వంటి సినిమాలంటే బాగా ఇష్టం. '1' ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అది ఫెంటాస్టిక్ ఫిల్మ్. నటునిగా మహేశ్ విరగదీశాడు. అది కనుక ఆడినట్లయితే కొత్త కథలతో చేయాలనుకునే వాళ్లకి ఇన్‌స్పిరేషన్ లభించేది. ఏదేమైనా నేను 'హై ఎనర్జీ' కేరక్టర్లని ఎంజాయ్ చేస్తా అంటున్నాడు సందీప్ కిషన్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన 'రారా కృష్ణయ్య'తో పాటు కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

  సందీప్ కిషన్ మాట్లాడుతూ... నటుణ్ణి కాకముందు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. అలా అని ఇప్పుడు డైరెక్షన్ మీద ఎలాంటి ఆసక్తీ లేదు. కానీ ప్రొడక్షన్‌లోకి వస్తా. ఎందుకంటే సినిమాకి మించి నాకేమీ తెలీదు. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని ఉంది. బన్ని (అల్లు అర్జున్) చేసే పాత్రలు నాకు ఇష్టం. 'ఆర్య', 'జులాయి', 'జగడం' అన్నారు.

  రెమ్యునేషన్ గురించి మాట్లాడుతూ... ''పారితోషికానికి నేను ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు. మంచి సినిమాలో భాగమైతే చాలనుకొన్నా. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలకి తప్ప ఇదివరకు చేసిన ఏ సినిమాకీ పారితోషికం తీసుకోలేదు. నచ్చిన సినిమా చేయాలనుకొన్నప్పుడు డబ్బుల గురించి పట్టించుకోకూడదనేది నా సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ప్రయాణం చేశాను. ఇక నుంచి నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం. ఇదివరకు హిందీ, తమిళంలో సరదాగా నటించాను. మళ్లీ అక్కడ సినిమా చేయాలంటే ముందు తెలుగులో మరొక విజయాన్ని అందుకోవాలి''. అన్నారు.

  తన తాజా ప్రాజెక్టుల గురించి చెప్తూ... ''చేసే ప్రతీ సినిమా కూడా కొత్తదనాన్ని పంచాలనుకొంటాను. ఓ ప్రేక్షకుడిగానే కథని విని ఎంపిక చేసుకొంటుంటాను. త్వరలో రానున్న 'రా రా కృష్ణయ్య' ఓ వైవిధ్యమైన చిత్రం. నేను చేస్తున్న తొలి ప్రేమకథ కూడా ఇదే. కథానేపథ్యం కొత్తగా ఉంటుంది. 'గుండెల్లో గోదారి' దర్శకుడు కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. అది కూడా చివరి దశకు చేరుకొంది. ఇదివరకు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేవాణ్ని. తదుపరి అవకాశం ఉంటుందో లేదో అని భయపడుతూ అలా ఒప్పుకొనేవాణ్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఒక సినిమా తర్వాతే మరొకటి చేయాలని నిర్ణయించుకొన్నా. అప్పుడే పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి వీలవుతుంది'' అన్నారు.

  English summary
  Sandeep Kishen who is on cloud nine with the success of his recent film ‘Venkatadri Express’ is all set to team up with ‘Gundello Godavari’ fame director Kumar Nagendra. Currently film makers are busy with finalising the cast. Further details about this project will be out soon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more