సందీప్ కిషన్‌కు అమేజాన్ నుండి ఊహించని పార్శల్, ఆ పని చేసిందెవరు?
క్రిస్‌మస్ సందర్భంగా తమ సన్నిహితులకు.... తామెవరో తెలియకుండా సీక్రెట్‌గా బహుమతులు పంపే సాంప్రదాయం ఉంది. అలా సీక్రెట్‌సాంతా పేరుతో సందీప్ కిషన్ కు ఓ పార్శల్ వచ్చింది. ఈ విషయాన్ని సందీప్ కిషన్ ట్విట్టర్
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సందీప్ కిషన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఇంటికొచ్చే సరికి ఆయన పేరు మీద అమేజాన్ నుండి ఓ పార్శల్ వచ్చింది. ఆ పార్శల్ మీద తన అండ్రస్, తన ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంది.

క్రిస్‌మస్ సందర్భంగా తమ సన్నిహితులకు.... తామెవరో తెలియకుండా సీక్రెట్‌గా బహుమతులు పంపే సాంప్రదాయం ఉంది. అలా సీక్రెట్‌సాంతా పేరుతో సందీప్ కిషన్ కు ఓ పార్శల్ వచ్చింది. ఈ విషయాన్ని సందీప్ కిషన్ ట్విట్టర్లో పోస్టు చేసారు.
'అమెజాన్ డెలివరీ బాయ్ నాకు ఫోన్ చేసి డెలివరీతో బయట ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. డెలివరీ తీసుకోవడానికి తిరిగి ఇంటికి వెళ్లాను. నా నెంబర్ నేను ఎవరికీ ఇవ్వలేదు. నాకు నవ్వాలో, భయపడాలో తెలియడం లేదు. నా నంబరు, చిరునామా బయటి వారికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేసారు.
ఇంతకీ సందీప్‌కి వచ్చిన ఆ అమెజాన్ పార్సిల్‌లో ఏముందంటే... క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగ్ కార్డు, ఓ షార్ట్ ఉంది. తన ఫ్రెండ్స్ ఈ పని చేసే అవకాశం లేదు, ఎవరు చేసారో అర్థం కావడం లేదంటూ సందీప్ కిషన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











