»   »  రాత్రింబవళ్లు శ్రమించడం నావల్ల కాదు

రాత్రింబవళ్లు శ్రమించడం నావల్ల కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sangeetha
'ఖడ్గం'సినిమాలో 'ఒకే ఒక్క ఛాన్స్‌..'అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగిన సంగీతను మర్చిపోవటం కష్టమే. ఆ మధ్య వరసగా పెద్దా చిన్నా తేడా లేకుండా అందరి సరసన హీరోయిన్ గా చేసిన సంగీత ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో చెయటానకి ఆసక్తి చూపుతోంది. తను పరిశ్రమలోకి ప్రవేశించన రోజులకు ఇప్పటికీ బేరీజు వేసుకుంటోంది. బాల వంటి దర్శకుడు వద్ద శివపుత్రుడు లో నటించటంతో ఆమె అందాల ఆరపోతకే కాక నటనా ప్రదాన్యత ఉన్న సినిమాలూ చెయ్యగలదని పెరు తెచ్చుకుంది.ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఆ రకంగానే పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది. ఆ సినిమా పేరు 'కనకం'.

ఇలాంటి మంచి పాత్రలొస్తే వెంటనే అంగీకరించేస్తాను... అదీ తెలుగు సినిమా అయితే మరీ మంచిది అంటోంది. కారణమేమిటని ప్రశ్నిస్తే ''తమిళంలో మొన్నామధ్య 'ఉయిర్‌' అనే సినిమా విడుదలైంది. అందులో వదిన పాత్రలో నటించాను. సినిమా విజయం సాధించింది. అప్పట్నుంచి కొన్ని వందల కథలు అలాంటివే తీసుకొచ్చి వినిపిస్తున్నారు.

ఇప్పుడు 'దనమ్‌' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో వేశ్యగా కనిపిస్తాను. దాంతో ఈ చిత్రంలో నా పాత్ర గురించి తెలుసుకొని అలాంటి కథలతో వస్తున్నారు. నన్ను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నింటినీ ఒప్పేసుకోలేను కదా!

అయినా 16 ఏళ్ల ప్రాయంలో కష్టపడినట్టు ఇప్పుడు చేయడం కుదరదు. రాత్రింబవళ్లు శ్రమించడం నావల్ల కాదు. అందుకే నా వయసుకు తగ్గ పాత్రలను, ప్రజల్ని మెప్పించగలననుకున్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను'' అని కచ్చితంగా సమాధానమిచ్చింది సంగీత. వేశ్య పాత్రలో నటన అంత సులభం కాదు అంటోందీమె. ఇబ్బందికరమైన సన్నివేశాల్ని సైతం సర్దుకుపోయి నటించాల్సి ఉంటుందని చెబుతోంది సంగీత.బెస్టాఫ్ లక్ సంగీత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X