Just In
- 49 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 3 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- News
ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జైలుకు సంజయ్ దత్ ఏం తీసుకెళ్లాడంటే...
జైలులో ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగేందుకు కోర్టు అనుమతించలేదు. అయితే, నెలరోజుల పాటు ఇంటి నుంచి ఆహారం, ఔషధాలు తెప్పించుకునేందుకు, మందపాటి పరుపు, దిండు సమకూర్చాలన్న వినతిని అంగీకరించింది. లొంగుబాటు గడువును పొడిగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అంతకుముందు న్యాయస్థానం నిర్దేశించినట్లుగానే గురువారం ఆయన టాడా కోర్టు ముందు హాజరయ్యారు.
మార్చి 21న సుప్రీంకోర్టు సంజయ్‌దత్‌కు ఐదేళ్ల శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఏడాదిన్నరపాటు కారాగార వాసాన్ని గడిపినందున మిగిలిన శిక్షా కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంది. పేలుళ్ల కేసులో దోషులైన మరో నలుగురు కూడా గురువారం టాడా కోర్టులో లొంగిపోయారు. వీరు... ఎస్సా మెమన్ (టైగర్ మెమన్ సోదరుడు) కేర్సి అద్జానియా, యూసుఫ్ నుల్వాలా, అల్తాఫ్ సయ్యద్ షేక్. మరో ఇద్దరు దోషులు..జేబున్సిసా కాజీ, షరీఫ్ (దాదా) శుక్రవారం లొంగిపోనున్నారు.
కోర్టులో లొంగుబాటు ప్రక్రియ ముగిసిన తర్వాత సంజయ్‌దత్‌ను ముంబయిలోని ఆర్దర్‌రోడ్ కేంద్ర కారాగారానికి తరలించారు. త్వరలోనే పుణేలోని ఎరవాడ జైలుకు తరలించే అవకాశముంది. సంజయ్‌దత్ గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రత్యేక టాడా కోర్టుకు వచ్చారు. ఆయన వెంట భార్య మాన్యత, సినీ నిర్మాత మహేష్ భట్, సోదరి, పార్లమెంటు సభ్యురాలు ప్రియ, బావ ఓవెన్ రాన్‌కన్ ఉన్నారు. కోర్టులో ప్రవేశించగానే సంజయ్ దత్ తలవంచి జడ్జి జీఏ సనప్‌కు అభివాదం చేశారు.
ఆ వెంటనే లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియను న్యాయస్థానం చేపట్టింది. దోషి గుర్తింపులో భాగంగా న్యాయమూర్తి సంజయ్ పేరును, శిక్షాకాలం వివరాలను అడిగి నిర్ధరించుకొన్నారు. ఆ తర్వాత సంజయ్ న్యాయవాది రిజ్వన్ మర్చెంట్ తన క్త్లెంటుకు జైలులో కల్పించాల్సిన సదుపాయాలగురించి విన్నవించారు.
సంజయ్‌దత్‌కు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా కోరుతూ త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన న్యాయవాది తెలిపారు. బాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు, బంధు మిత్రులు బాంద్రాలోని ఇంపీరియల్స్ హైట్స్ భవనంలోని దత్ నివాసానికి వచ్చి అధైర్యపడవద్దన్నారు.