మున్నాబాయ్‌కి ఎదురు దెబ్బ: పిటిషన్ తిరస్కరణ

1993 ముంబై పేలుళ్ల కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఐదేళ్ల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యెరవాడ జైలులో ఉన్నారు. సంజయ్ దత్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడానికి ఏ విధమైన అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు.
దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.
sanjay dutt supreme court bollywood bomb blasts mumbai సంజయ్ దత్ సుప్రీంకోర్టు బాలీవుడ్ బాంబు పేలుళ్లు ముంబై


Click it and Unblock the Notifications