»   »  ట్రైలర్ వచ్చిన ఆనందంలో భార్యతో డాన్స్ చేసాడు: ఇదే ఇంకా వైరల్ అయ్యింది

ట్రైలర్ వచ్చిన ఆనందంలో భార్యతో డాన్స్ చేసాడు: ఇదే ఇంకా వైరల్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్స అందరిలో స్టైల్ అండ్ సెక్సీ మాన్ ఎవరు అంటే ఇప్పుడు చాలా పేర్లు వస్తాయి. కానీ కొన్ని ఏళ్ళు కిందట ఇదే ప్రశ్న వేస్తే ఎక్కువ మంది ఎన్నుకొనేది మాత్రం సంజయ్ దత్ నే. అతని అభిమానులు ముద్దుగా సంజు బాబా అని పిలుచుకుంటారు. చూడానికి కొంచం మొరటోడు మొండోడు లా కనిపించినా అందరితో ప్రేమగా స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిగా చెప్పుకుంటారు. అలాంటి వాడు కూతురుని ఎలా ప్రేమిస్తాడో మనం ఊహించుకోవచ్చు.

'భూమి' ట్రైలర్‌

'భూమి' ట్రైలర్‌

భూమి... సంజయ్ దత్ నటించిన బాలీవుడ్ కంబ్యాక్ ఫిల్మ్. జైలు శిక్ష కారణంగా సినిమాలకు దూరమైన సంజయ్ దత్.... శిక్ష ముగిసిన తర్వాత చేస్తున్న తొలి సినిమా. సంజయ్ దత్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'భూమి' చిత్రానికి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్, అదితి తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

Ashwini Dutt announced to make 9 big-budget films - Filmibeat Telugu
సూపర్‌గా డాన్స్ చేశాడు

సూపర్‌గా డాన్స్ చేశాడు

గురువారం విడుదలైన సంజయ్ దత్ నటించిన 'భూమి' ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. విశేషం ఏమంటే అదే రోజున సంజూభాయ్ కుమార్తు త్రిషాలా పుట్టిన రోజు. ట్రైలర్ విడుదల సమయంలో వాయిస్ మెసేజ్ ద్వారా తండ్రితో కలసి తన ఆనందాన్ని పంచుకుంది త్రిషాలా. ఇక అదే రోజు రాత్రి తన కుమార్తె పుట్టిన రోజు పార్టీలో భార్య మాన్యతతో కలసి సూపర్‌గా డాన్స్ చేశాడు సంజయ్ దత్. 'భూమి' ట్రైలర్‌ను మించి ఈ డాన్స్ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

పెద్ద కూతురు త్రిశాల దత్

పెద్ద కూతురు త్రిశాల దత్

అతని రెండో భార్య కూతుర్లు శాహ్రాన్ ఇక్రా అతనితోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సంజయ్ ముద్దు ముచ్చట దొరుకుతుంది. కానీ పెద్ద కూతురు త్రిశాల దత్ మాత్రం ఉండేది అమెరికాలో. కానీ ప్రతి రోజు వీడియో చాట్లో కూతురు నాన్న కలిసి మాట్లాడుకుంటారు. గతం లో తన కూతురైన త్రిశాల మీద ఎంత ప్రేమతో ఉంటాడో చెప్పాడు ఒక్క సారి కాదు చాలా సార్లు

తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా

తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా

తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న త‌న‌ సినిమా 'భూమి' గురించి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంజ‌య్ ద‌త్ చిత్రంలో తన కూతురి పాత్ర గురించి, నిజజీవితంలో తన కూతురి త్రిశాల గురించి మాట్లాడుతూ తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా "మా త్రిశాల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా" అని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా.

English summary
Bollywood Star Sanjay Dutt and his wife Dance video is going viral on social media,
Please Wait while comments are loading...