»   » సంజయ్ దత్ మొదటి భార్య చనిపోతూ రాసిన లేఖ ఇదే..

సంజయ్ దత్ మొదటి భార్య చనిపోతూ రాసిన లేఖ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: గత కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపతున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సత్ర్పవర్తన మీద ఇటీవల జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుండి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులుగా సంజయ్ దత్ ఇంటికి బంధువులు, స్నేహితులు, సన్నిహితుల రాకపోకలతో సందడి వాతావరణం నెలకొంది.

Sanjay Dutt’s daughter Trishala shares her mother’s last written letter

సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కుమార్తె త్రిషాల కూడా సంజయ్‌ జైలు నుంచి రావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సంజయ్‌ మొదటి భార్య రిచా శర్మ బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ మరణించింది. అప్పుడు త్రిషాలకు ఎనిమిదేళ్లు. తల్లి చనిపోతూ చివరిగా రాసిన లేఖను త్రిషాల ఇటీవల సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేసారు. 21 ఏళ్ల కిందట తాను ఈ ఉత్తరాన్ని చూశానని, జీవితం చాలా చిన్నదంటూ పోస్ట్‌ చేశారు. 'అమ్మను మిస్సయ్యా'ను అంటూ తల్లితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

'మనం అందరం కలిసి నడుస్తాం. కానీ ఎవరిదారి వారే చూసుకుంటారు. నేనూ నా దారి చూసుకున్నా. ఆ దారి మరణానికి దగ్గరగా ఉంది. నేను ఎలా వెనక్కు రాగలను? నాకు మరో అవకాశం ఉంటుందా? కాలమే వీటన్నింటికీ సమాధానం చెబుతుంది. ఎంత కాలమైనా ఎదురు చూస్తా. వెనక్కు వచ్చే దారి లేదని నాకు తెలుసు. ఇప్పటికీ నాకు ఆశ ఉంది. ఓ దేవదూతా.. నా కలలు ఉన్న చోటకు నన్ను తీసుకెళ్లు. అందుకోసం ఎదురు చూస్తా. నన్ను జాగ్రత్తగా చూసేందుకు వాళ్ల రెండు చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తున్నారు' అని రిచా శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.

రిచా శర్మ మరణం తర్వాత సంజయ్ దత్ 1998లో మోడల్ రియా పిళ్లైని రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2005లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. అనంతరం 2008లో నటి మాన్యతను మూడో వివాహం చేసుకున్నారు. సంజయ్, మాన్యత దంపతులకు ఇద్దరు సంతానం.

English summary
Sanjay Dutt’s daughter Trishala Dutt was eight-year-old when her mother Richa Sharma passed away in 1996. She was suffering from brain tumour. Trishala, who is deeply fond of her mother, shares her last hand written emotional letter on social media. Trishala also admits that her natural flair for writing comes from her mother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu