»   » మున్నాభాయ్ జైలునుంచి ముందే వచ్చేస్తాడు

మున్నాభాయ్ జైలునుంచి ముందే వచ్చేస్తాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సంజయ్ దత్ ని శిక్షాకాలం గడువు కన్నా దాదాపు ఆరు నెలలు ముందే విడుదలే చేసే అవకాశముందని మహారాష్ట్ర టైమ్ దినపత్రిక రాసుకొచ్చింది. జైల్లో సంజయ్ దత్ చాలా పద్దతిగా ఉండటమే అందుకు కారణమని రాసుకొచ్చింది. జైలుశిక్షాకాలంలో ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే అతనికి 114 రోజులపాటు శిక్షను తగ్గించే అవకాశముంది. ఈ మేరకు చట్టాల్లో ఉన్న ఓ క్లాజును ఎరవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.

ఇప్పటికే చాలా బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న సంజయ్ దత్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికే అవకాశముంది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదల కావొచ్చునని భావిస్తున్నట్టు ఆ దినపత్రిక తెలిపింది.

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని ఆరోపణలతో సంజయ్ దత్ కు జైలుశిక్ష పడింది. ఇప్పటికే ఆయన పలుసార్లు పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో గడిపారు. ప్రస్తుతం ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ కు ఈ క్లాజ్ ప్రకారం భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది.

Sanjay Dutt's jail term reduced by six months?

మరో ప్రక్క సంజయ్‌దత్‌కు మారుపేరులా నిలిచిపోయిన మున్నాభాయ్‌ సీరిస్ ఇప్పుడు మూడోపార్ట్ కు సిద్దమవుతోంది. అయితే ఇప్పటికే 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌', 'లగేరహో మున్నాభాయ్‌'ల్లో మున్నాభాయ్‌గా కనిపించి ఆకట్టుకున్న సంజయ్‌దత్... కు మాత్రం మొండి చేయి చూపించి రణ్ బీర్ కపూర్ తో ముందుకు వెళ్లనున్నారనే వార్త ఆ మధ్య ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడింది. అయితే ఇప్పుడు సంజయ్ దత్ తోనే ముందుకు వెళ్తానని దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ అఫీషియల్ గా ప్రకటించారు.

సంజయ్‌దత్‌ జీవితకథతో రాజ్‌కుమార్‌ హిరాణీ ఈ చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. సంజయ్‌ జీవితాన్ని యదార్థంగా చిత్రీంచేలా ఉంటుందని హిరాణీ చెప్పారు.

''తొలుత సంజయ్‌ జీవితకథతో సినిమా చేయడానికి సందేహించాను కానీ దీనిలో ముంబయి మాఫియాకు సంబంధించిన విషయాలూ ఇందులో ఉన్నందున దీనిపై సంజయ్‌తో నెల రోజులు జరిపిన చర్చలతో నా నిర్ణయం మారింది. ఆయన జీవితంలో ఉన్న మానవీయత, భావోద్వేగాలు నన్ను కట్టిపడేశాయి. సంజయ్‌ను ఉత్తముడిగా చిత్రీకరించేలా కాక జరిగిన సంఘటనలను వివరించేలా ఇది ఉంటుంది''అన్నారు.

English summary
Sanjay Dutt, who is currently serving time in the Yerawada jail, might get an early respite from the imprisonment thanks to his good behaviour, as stated in a Maharashtra Times report.
Please Wait while comments are loading...