»   » ఐశ్వర్యరాయ్ ఐటంసాంగ్ వార్తలపై దర్శకుడి వివరణ

ఐశ్వర్యరాయ్ ఐటంసాంగ్ వార్తలపై దర్శకుడి వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai
ముంబై : అందాలతార ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యకు జన్మనిచ్చినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోందని, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామ్ లీలా' చిత్రంలో ఐటం సాంగు ద్వారా రీ ఎంట్రీ ఇస్తోందని బాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో 'రామ్ లీలా' దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పందించారు. ఐశ్వర్యరాయ్ తన సినిమాలో ఐటం సాంగు చేయడం లేదని స్పష్టం చేసారు. ఇవన్నీ అధారం లేని రూమర్లే అంటూ సంజయ్ లీలా భన్సాలీ తేల్చి చెప్పారు. ఇలాంటివి నమ్మవద్దని సూచించారు.

'మొదటి సోనాక్షి సిన్హా అన్నారు, ఆ తర్వాత మాధురి దీక్షిత్ అన్నారు...ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదు' అంటూ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ వ్యాఖ్యానించారు.

గతంలో ఐశ్వర్యరాయ్ సంజయ్ లాలీ బన్సాలీ తెరకెక్కించిన 'హమ్ దిల్ దే చుకె సనమ్' చిత్రంలో సల్మాన్ సరసన, 'దేవదాస్' చిత్రంలో షారుక్ ఖాన్ సరసన, 'గుజారిష్' చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటించింది. ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ ఐశ్వర్యరాయ్‌ కలవడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

రామ్ లాలా సినిమా విషయానికొస్తే....సంజయ్ లీలా బన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రణవీర్ సింగ్, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లు. ఈ సంవత్సరాంతంలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary

 Filmmaker Sanjay Leela Bhansali has clarified that there is "no truth" to rumours that actress Aishwarya Rai has been roped in for an item song in his under production project Ram Leela.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu