Just In
- 28 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ నిర్మాత నాశనం చేస్తా అనడంతో.. మందు బాటిల్‌తో దాడి విషయమై నటి సంజన రియాక్షన్
ఇటీవల నటి సంజన, నిర్మాత వందన జైన్ మధ్య జరిగిన గొడవ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ నైట్ పార్టీలో పైగా పబ్బులో ఈ ఇద్దరూ గొడవపడటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు వార్తల్లోనూ ఈ ఇష్యూ అగ్ర స్థానంలో నిలిచింది. అయితే తాజాగా ఈ ఇష్యూపై సంజన స్పందించింది. వివరాల్లోకి పోతే..

పబ్బులో గొడవ.. మందు బాటిల్ పగిలింది
బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ (పబ్)లో తాగిన మైకంలో దాడి నటి సంజన తనపై దాడి చేసిందని నిర్మాత వందన జైన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన ముఖంపై మందు బాటిల్ విసిరేసిందని వందన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

వందన ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణ
నిర్మాత వందన జైన్ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ తరుణంలో తాను చేశానని వస్తున్న వార్తలు, పబ్ లో ఘటనపై సంజన వివరణ ఇచ్చింది. వందన తనపై తప్పుడు కేసు పెట్టిందని సంజన చెప్పుకొచ్చింది.

నాశనం చేస్తా అంటూ బెదిరింపులు
వందన ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఈ కేసు పెట్టిందని సంజన తెలిపింది. ఆ రోజు పబ్బులో వందన తనతో వాదులాటాకు దిగి నానా మాటలు అందని చెప్పింది సంజన. తనను, తన కుటుంబ సభ్యులను అనరాని మాటలు అందని, అలాగే తన కుటుంబాన్ని నాశనం చేస్తానని వందన జైన్ బెదిరించిందని సంజన పేర్కొంది.

తప్పుడు కేసు పెట్టింది.. కంట్రోల్ చేసుకున్నా
వందన ఎన్ని మాటలు అన్న ఎంతో కంట్రోల్ చేసుకున్నానని చెబుతోంది సంజన. ఈ మేరకు తాను వందనపై ఎటువంటి దాడి చేయలేదని సంజన తెలిపింది. అంతేకాదు ఆమెనే తనపై దాడి చేసి.. పైగా ఇపుడు తనపైనే తప్పుడు కేసు పెట్టిందని అంటోంది సంజన.

ఆమెదే కాదు నా వెర్షన్ కూడా వినండి
ఇక మీడియా కూడా వన్ సైడ్‌గా వందన జైన్ చెప్పిందే నమ్ముతోందని సంజన ఆరోపించింది. ఈ ఇష్యూలో ఆమె వెర్షనే కాదు తన వెర్షన్ కూడా వినాలని రిక్వెస్ట్ చేసింది సంజన. చూడాలి మరి ఈ కేసు విషయమై ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో!.