»   » బెల్లంకొండ సురేష్ తో వివాదం పై దర్శకుడు వివరణ

బెల్లంకొండ సురేష్ తో వివాదం పై దర్శకుడు వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Santhosh Srinivas and Ballamkonda Suresh
హైదరాబాద్ : నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో ఆ మధ్యన కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ గొడవ ఫిల్మ్ ఛాంబర్ వరకూ వెళ్లింది. అయితే ఆ తర్వాత రాజీపడి ఎన్టీఆర్ తో చిత్రం ప్రారంభిస్తున్నారు. వచ్చేనెలలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఆ వివాదం గురించి సంతోష్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

తలెత్తిన వివాదం గురించి స్పందిస్తూ - ''కథ గురించే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దర్శక, నిర్మాతల మధ్య ఇలాంటి వృత్తిపరమైన విబేధాలు పరిశ్రమలో సహజమే. అయినా మా వివాదం ఎప్పుడో సమసిపోయింది'' అన్నారు.

కందిరీగ చిత్రం విడుదలై ఇప్పటికి రెండేళ్ళయ్యింది. ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం లభించడంతో ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం లభించిందని భావిస్తున్నాను'' అని సంతోష్ శ్రీనివాస్ చెప్పారు. 'కందిరీగ'తో దర్శకునిగా పరిచయమైన ఛాయాగ్రాహకుడు సంతోష్ శ్రీనివాస్ తన రెండో చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేస్తున్నారు.

ఆయన చెప్తూ... ''ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా ఆయన శైలిలో మాస్ అంశాలు మేళవించి, కుటుంబ నేపథ్యంలో ఉంటుంది. వినోదానికి పెద్ద పీట వేస్తాం. బయట ప్రచారంలో ఉన్నట్టుగా ఇది 'కందిరీగ' చిత్రానికి సీక్వెల్ కాదు. అలాగే మేం ఇప్పటి వరకూ టైటిల్ ఓకే చేయకుండానే 'రభస' అని ప్రచారం జరుగుతోంది అన్నారు.

English summary
Director Santosh Srinivas says...Disputes with Bellamkonda Suresh is not a big thing...and it's common in Film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu