»   » మమ్మల్ని బాధ పెట్టడం వల్ల ఏం వస్తుందో.... సప్తగిరి కంటతడి!

మమ్మల్ని బాధ పెట్టడం వల్ల ఏం వస్తుందో.... సప్తగిరి కంటతడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌. డిసెంబ‌ర్ 23న విడుదలైన ఈచిత్రం స‌క్సెస్‌ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో సప్తగిరి మాట్లాడుతూ.... హీరోగా నేను చేసిన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకలు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ప్రేక్షకలు మా సినిమాను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు, మీడియా సపోర్టు కూడా ఉండటంతో సినిమా త్వరగా ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యిందన్నారు.


పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన మాట నిజమైంది

పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన మాట నిజమైంది

సినిమా ఆడియో విడుద‌ల రోజు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారి ముందు ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డేలా సినిమా ఉంటుంద‌ని ఏ నమ్మ‌కంతో అయితే మాట ఇచ్చాను. ఈరోజు ఆ న‌మ్మ‌కం నిజ‌మైనందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సప్తగిరి చెప్పుకొచ్చారు.


కంటతడి పెట్టిన సప్తగిరి

కంటతడి పెట్టిన సప్తగిరి

కొంత మంది ఏదో మ‌న‌సులో ప‌ర్స‌న‌ల్ టార్గెట్‌గా పెట్టుకుని రివ్యూల్లో ఏదో రాసారు. అయినా మా సినిమాను ప్రేక్షకులు ఆద‌రించారు. స‌ప్త‌గిరి 12 ఏళ్ల క‌ష్టంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. మ‌మ్మ‌ల్ని, మా కుటుంబ స‌భ్యుల్ని బాధ పెట్ట‌డం వల్ల వారికేం వ‌స్తుందో నాకు తెలియ‌డం లేదు. ఏదైతేనేం స‌ప్త‌గిరి గెలిచాడు, నిర్మాత గెలిచారు. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని గెలిపించారు అంటూ.... సప్తగిరి భావోద్వేగంతో కంటతడి పెట్టారు.


దర్శకుడిని అవ్వాలని వచ్చా, సినిమా తీస్తా

దర్శకుడిని అవ్వాలని వచ్చా, సినిమా తీస్తా

నేను దర్శకుడిని అవ్వాలని సినిమా రంగంలోకి వచ్చాను. కానీ నటుడిగా మారాను. ఎప్పటికైనా దర్శకత్వం చేస్తా, సినిమా తీస్తాను అని సప్తగిరి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.


తెలంగాణ నుండి మంచి నిర్మాతను పరిచయం చేసా

తెలంగాణ నుండి మంచి నిర్మాతను పరిచయం చేసా

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తెలంగాణ నుండి మంచి నిర్మాత‌ను పరిచ‌యం చేశాను. ర‌వికిర‌ణ్‌గారు భ‌విష్య‌త్‌లో గొప్ప నిర్మాత‌గా పేరు తెచ్చుకుంటారు. డీమానిటైజేష‌న్‌లో కూడా ఎనిమిది నెల‌ల‌పాటు కొన్ని వంద‌ల మందికి నిర్మాత‌గారు ప‌ని క‌ల్పించారు అని సప్తగిరి తెలిపారు.


సినిమా సూళ్ల గురించి నిర్మాత

సినిమా సూళ్ల గురించి నిర్మాత

నిర్మాత డా.ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ - ``దేవుడి ద‌య వ‌ల్ల సినిమా పెద్ద హిట్ అయ్యింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా బి, సి సెంటర్లలో మంచి వసూళ్లు సాధించింది. తొలి రోజు మా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.35 కోట్ల గ్రాస్ సాధించంది. చిన్న సినిమా అయినా క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నిర్మాత‌గా ప్రారంభంలో కొన్ని త‌ప్పుల‌ను చేసినా వాటిని క‌రెక్ట్ చేసుకుంటూ వ‌చ్చాను. ఇప్పుడు సినిమా స‌క్సెస్‌ను ప్రేక్ష‌కుల‌తో క‌లిసి పంచుకోవ‌డానికి రేప‌టి నుండి సక్సెస్ టూర్ వ‌స్తున్నాం`` అన్నారు.


English summary
Saptagiri Express Movie Success Meet held at Hyderabad. Saptagiri, Arun Pawar, Dr.K. Ravi Kiran, C Ram Prasad, Goutham Raju graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu