For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తాగినప్పుడు అలా చేస్తాను.. పనికి రావు పో అన్నారు..చరణ్ పేరు మార్చాను .. సప్తగిరి

  By Rajababu
  |

  అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన సప్తగిరి.. కమెడియన్‌గా.. ఆ తర్వాత హీరోగా సత్తా చాటుకొన్నాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో ప్రారంభమైన ఆయన హీరో ప్రయాణం బ్రహ్మండంగా సాగింది. తాజాగా విడుదలైన సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రం విజయం సాధించిన సందర్భంగా ఆయన ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడారు. సప్తగిరి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

   డైరెక్టర్ కావాలని

  డైరెక్టర్ కావాలని

  చిన్నప్పటి నుంచి డైరెక్టర్ కావాలని కలలు కనేవాడిని. సినిమాలు చూసి బాగా విశ్లేషించేవాడిని. చదువు పెద్దగా అబ్బలేదు. క్రికెట్ ఆడాలని ఉండేది. నా కుటుంబ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాదు అని తెలుసుకొన్నాను. అందుకే సినిమా రంగంలో రాణిస్తాను అని డిసైడ్ చేసుకొని పరిశ్రమలో అడుగుపెట్టాను.

   ఆ రెండు సినిమాలు

  ఆ రెండు సినిమాలు

  నేను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం రెండు సినిమాలు. కృష్ణవంశీ రూపొందించిన సింధూరం, శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు. ఈ సినిమాలు నా బాగా టెంప్ట్ చేశాయి. యవ్వనంలో ప్రేమ కథా చిత్రాలు ఆకట్టుకొంటాయి. కానీ నన్ను మాత్రం ఈ రెండు చిత్రాలు నాలో స్ఫూర్తిని పెంచాయి.

  నా పేరు సప్తగిరి

  నా పేరు సప్తగిరి

  నా పేరు వెంకట ప్రభు ప్రసాద్. ఒకరోజు తిరుమల మాఢవీధుల్లో అలా తిరుగుతుండగా ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి నాయన సప్తగిరి పక్కకు జరుగు అనే మాట వినిపించింది. వెనుకకు చూడగా ఓ స్వామి కనిపించాడు. ఆయన వెళ్లిన తర్వాత మరో 40 మంది స్వాములు కనిపించారు. వారాంత నన్ను చూసి నవ్వారు. సప్తగిరి పేరు ఎందుకో బాగా అనిపించింది. అందుకే సప్తగిరి అనే పేరు పెట్టుకొన్నాను.

  బొమ్మరిల్లు భాస్కర్ ఆఫర్

  బొమ్మరిల్లు భాస్కర్ ఆఫర్

  సప్తగిరి పేరు పెట్టుకొన్న తర్వాత 15 రోజులకు హైదరాబాద్ వచ్చాను. బొమ్మరిల్లు భాస్కర్, శేఖర్ సూరి, చంద్ర సిద్ధార్థ తదితరుల అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. నేను యాక్టర్ కావడానికి కారణం బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు చిత్రంలో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా 175 రోజులు ఆడింది.

  పరుగులో అవకాశం అలా

  పరుగులో అవకాశం అలా

  బొమ్మరిల్లు తర్వాత పరుగు చిత్రంలో ఓ పాత్ర ఇచ్చాడు. కానీ నేను ఒప్పుకోలేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వను అని భాస్కర్ చెప్పారు. బలవంతంగా పరుగు సినిమాలో అవకాశం లభించింది. అప్పటి నుంచి నాకు యాక్టర్లుగా ఆఫర్లు రావడం వచ్చాయి. ఆ తర్వాత హీరో అయిపోయాను.

   తాగినప్పుడే డ్యాన్సులు

  తాగినప్పుడే డ్యాన్సులు

  డ్యాన్సులు అనేవి కొత్తగా నేర్చుకోలేదు. నా బాడీలోనే ఆ రిథం ఉంది. చేస్తాను అనే నమ్మకం ఉండేది. చేయగలను అనే విశ్వాసం మనసులో ఉండేది. తాగినప్పుడు లేదా బీరు పుచ్చుకొన్నప్పుడు తెగ డ్యాన్సులు చేసేవాడిని. అంతేగానీ ప్రత్యేకంగా డ్యాన్సులు నేర్చుకోలేదు.

   పవన్ కల్యాణ్ అడగడంతో

  పవన్ కల్యాణ్ అడగడంతో

  సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమా‌కు ముందు ఆ చిత్రం పేరు కాటమరాయుడు. సినిమా అదే పేరుతో 95 శాతం పూర్తయింది. ఆ సమయంలో నిర్మాత శరత్ మరార్ వచ్చి కాటమరాయుడు టైటిల్ కావాలని అడిగాడు. కానీ మేము ఒప్పుకోలేదు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ అడగడంతో మా నిర్మాత రవికిరణ్ ఒప్పించి టైటిల్‌ను ఇచ్చేశాం.

   పవన్ మానవతా మూర్తి

  పవన్ మానవతా మూర్తి

  పవన్ కల్యాణ్ అలాంటి మానవతమూరి అడిగినప్పుడు కాదనలేకపోయాను. పవన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సప్తగిరి ఆడియోకు ఆయన రావడం జీవితంలో మరిచిపోలేని విషయం.

   చరణ్ పేరు మార్చాను..

  చరణ్ పేరు మార్చాను..

  సప్తగిరి ఎల్‌ఎల్‌బీ దర్శకుడు అసలు పేరు మల్లి. డైరెక్షన్ విభాగంలో చాలా సీనియర్. నా సినిమాకు ఆయనను డైరెక్టర్‌గా పెట్టుకొన్నాం. ఆయన పేరు మార్చితే బాగుంటుంది అనుకొన్నాను. మీ అబ్బాయి పేరు ఏమిటని అడిగితే చరణ్ అని చెప్పాడు. అంతే నేను నీ పేరు చరణ్ అని అన్నాను. ఆయన పేరు అలా చరణ్‌గా మారింది.

  English summary
  Saptagiri's latest movie is Saptagiri LLB. This movie is going with good report. In this occassion, Saptagiri speak to a leading television Channel. He reveals so many issues to the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X