»   » తాప్సీతో నాకు అఫైర్ లేదు.. డేటింగ్ చేయడం లేదు. ..

తాప్సీతో నాకు అఫైర్ లేదు.. డేటింగ్ చేయడం లేదు. ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అందాల తార తాప్సీ పొన్ను దూసుకెళ్తున్నది. పింక్, నామ్ షబానా లాంటి విభిన్నమైన చిత్రాలతో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ చూరగొంటున్నది. తాజాగా యువ నటుడు సాకీబ్ సలీంతో అఫైర్ సాగుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలపై సాకిబ్ స్పందిస్తూ.. అలాంటి వార్తలన్నీ గాసిప్స్ మాత్రమే.. వాటిలో వాస్తవం లేదు అని అన్నారు. తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన రిలేషన్ మాత్రమేనని చెప్పారు.

డేటింగ్ చేయడం లేదు

డేటింగ్ చేయడం లేదు

తాప్సీతో నేను డేటింగ్ చేయడం లేదు. ఆమెతో అఫైర్ గురించి చాలా మంది అడుగుతూ విసుగు తెప్పిస్తున్నారు. మా మధ్య అలాంటి రిలేషన్ లేదని నేను వారికి పదే పదే చెప్తున్నాను. తాప్సీ కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకంటే మా మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అని సాకిబ్ తెలిపారు

ఇద్దరం ఢిల్లీకి చెందిన వారమే..

ఇద్దరం ఢిల్లీకి చెందిన వారమే..

నేను తాప్సీ ఇద్దరం ఢిల్లీకి చెందిన వారమే. దాంతో మధ్య పరిచయం బలంగా మారింది. మా మధ్య రిలేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమెతో కలిసి సమయాన్ని గడపడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమెకు కూడా పార్టీలు ఎంజాయ్ చేయడమంటే ఇష్టం. దాంతోపాటు మా ఇద్దరి అభిరుచులు కామన్‌గా ఉంటాయి అని సాకిబ్ చెప్పారు.

మ్యూజిక్ వీడియో షూటింగ్‌లో..

మ్యూజిక్ వీడియో షూటింగ్‌లో..

తాప్సీ, సాకిబ్ ఇద్దరూ కలిసి ఇటీవల తుమ్ హో లగ్తా హై మ్యూజిక్ వీడియోలో నటించారు. ఆ సందర్భంగా వారిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వారు కలిసి కనిపించారు. గతేడాది తాప్సీ బర్త్‌డే సందర్భంగా వారి అన్యోన్యంగా ఉంటూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట చేశాడు సాకిబ్. దాంతో వారి మధ్య అఫైర్ ఉందని, తాప్సీతో సాకిబ్ డేటింగ్ చేస్తున్నారనే వార్త వైరల్ అయింది. ప్రస్తుతం మక్నా అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

నేను డేటింగ్ చేస్తున్నాను..

నేను డేటింగ్ చేస్తున్నాను..

ఇదిలా ఉండగా, నేను ఓ వ్యక్తితో ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని తాప్సీ మీడియాకు వివరించింది. అయితే తన ప్రియుడి పేరుని చెప్పడానికి నిరాకరించింది. తనతో రిలేషన్ షిప్‌లో ఉన్న వ్యక్తి చాలా ఉన్నతమైన వాడని తాప్సీ పేర్కొన్నది. అతనితో ఉండటం చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు.

English summary
Saqib Saleem and Taapsee Pannu appeared together in the music video of Tum Ho Toh Lagta Hain, the grapevine has been buzzing with rumours of their budding love. However, media asked Saqib about Taapsee, he said that he was not in a relationship with her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu