»   » వామ్మో ఏంటా అందం..!!? సారా అలీఖాన్ "కేదార్‌నాథ్" ఫస్ట్ లుక్

వామ్మో ఏంటా అందం..!!? సారా అలీఖాన్ "కేదార్‌నాథ్" ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ 'కేదార్‌నాథ్' మూవీతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుట్, సారా అలీఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 3న ప్రారంభం అయ్యింది. అభిషేక్ కపూర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కేదార్‌నాథ్‌లో జరిగిన లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

సుషాంత్‌సింగ్‌, సారా అలీ ఖాన్‌

సుషాంత్‌సింగ్‌, సారా అలీ ఖాన్‌

ఈ సినిమా నిర్మాత అభిషేక్‌ కపూర్‌ మాట్లాడుతూ....."నా గత చిత్రాల మాదిరిగానే ఎంతో ప్యాషన్‌గా ఈ చిత్రకథను రాసుకున్నాను. అత్యంత అద్భుతమైన కేదార్‌నాథ్‌ టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఇందులో సుషాంత్‌సింగ్‌, సారా అలీ ఖాన్‌ ప్రేమ జంటగా నటిస్తున్నారు.

Celebrities Who Went to Jail for Crimes
 సుషాంత్‌, సారాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది?

సుషాంత్‌, సారాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది?

టూరిస్ట్‌ గైడ్‌గా సుషాంత్‌, టూరిస్ట్‌గా సారా పాత్రలు ప్రేక్షకుల మదిని దోచేస్తాయని నమ్మకంగా చెప్పగలను. ఇప్పటికైతే ఈచిత్రం గురించి ఇంతే చెప్పగలను. మిగిలింది సినిమానే చెబుతుంది" అని చెప్పారు. ‘2013లో కేదార్‌నాథ్‌లో వరదలు విలయతాండవం చేశాయి. ఈ ఘోర విపత్తులోనూ సుషాంత్‌, సారాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది?, వరదల నుంచి బయటపడి తమని, తమ ప్రేమని కాపాడుకున్నారా లేదా? అనేది ఈ చిత్ర ఇతివృత్తం' అని బాలీవుడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

కేదార్‌నాథ్‌ వరదల నేపథ్యంలో

కేదార్‌నాథ్‌ వరదల నేపథ్యంలో

వరదల బీభత్స తాకిడికి 2013లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘కేదార్‌నాథ్‌' అతలాకుతలమైన విషయం విదితమే. ఈ ఘోర విపత్తులో దాదాపు ఆరు వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ వరదల నేపథ్యంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని అల్లుకున్నాడు బాలీవుడ్‌ దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ .

ఫస్ట్ లుక్ పోస్టర్‌

ఫస్ట్ లుక్ పోస్టర్‌

ఈ చిత్రానికి ‘కేదార్‌నాథ్‌' అనే టైటిల్‌ ఖరారు చేశాడు. దీనికి ‘లవ్‌ ఈజ్‌ ఈ ప్రిలిగ్రిమేజ్‌' అనే క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ చిత్ర పోస్టర్‌ను దర్శక, నిర్మాత అభిషేక్‌ కపూర్‌ బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సారా అలీఖాన్ బ్యూటీఫుల్ కాస్ట్యూమ్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది.

అభిషేక్ కపూర్ డైరెక్షన్‌లో

అభిషేక్ కపూర్ డైరెక్షన్‌లో

తెలుపు రంగు కాస్టూమ్స్ వేసుకున్న సారా గొడుగు పట్టుకుని..గుర్రంపై కేదార్‌నాథ్‌కు వెళ్తున్న స్టిల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కేదార్‌నాథ్ ప్రాంతంలో జరిగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఎంఎస్ ధోనీ ఫేం సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు. అభిషేక్ కపూర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం కేదార్‌నాథ్ లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని..ఇటీవలే ముంబైకు చేరుకుంది.

English summary
After wrapping the shoot of the film at Kedarnath Temple, the makers have now shared the first look of the debutante.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu