»   » నాని హీరోయిన్ పెళ్లి ఫిక్సయింది, ఇతడే... (ఫోటో)

నాని హీరోయిన్ పెళ్లి ఫిక్సయింది, ఇతడే... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు' సినిమాతో పాటు ‘విలేజ్‌లో వినాయకుడు', ‘హ్యాపీ హ్యాపీగా' చిత్రాల్లో కథానాయికగా నటించి హీరోయిన్ శరణ్య త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. కేరళకు చెందిన అరవింద్ కృష్ణన్ అనే ఓ వైద్యుడిని ఆమె సెప్టెంబరులో వివాహమాడబోతోంది. జులై 12న వీరి నిశ్చితార్థం కూడా జరిగింది.

తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా శరణ్య ఈ విషయాన్ని తెలియజేసింది. శరణ్య, అరవింద్ చిన్న నాటి నుండి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. కేరళకి చెందిన శరణ్య అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకొంది.

Saranya Mohan marriage details

ఆమె కెరీర్ విషయానికొస్తే...
తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలే లేక పోవడంతో ఇతర పాత్రలు సైతం చేసింది. కత్తి చిత్రంలో కళ్యాణ్ రామ్ చెల్లిగా నటించింది. తెలుగులో అవకాశాలు లేక పోవడంతో తమిళ, మళయాలం చిత్రాల వైపు మళ్లింది. అక్కడ కూడా ఆమె కెరీర్ ఆశించిన స్థాయి లేదు. దీంతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వాలని నిర్ణయించుకుంది.

English summary
"I am taking this opportunity to officially announce you all about the most important day of my life that is about to come...my marriage...I got engaged today to Aravind Krishnan, Doctor by profession. Please do pray for me even after marriage. Thanking you all for the love and support" Actress Saranya Mohan said.
Please Wait while comments are loading...