»   » ముందు అప్పులు కట్టండి : బాహుబలి-2 రిలీజ్ ఆపాలని పిటీషన్!

ముందు అప్పులు కట్టండి : బాహుబలి-2 రిలీజ్ ఆపాలని పిటీషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి-ది కంక్లూజన్' ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న వేళ అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే కర్నాకలో సినిమా విడుదల అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కావేరీ జలాల వివాదంలో కట్టప్ప(సత్యరాజ్) గతంలో ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ కోపాన్ని సినిమాపై చూపిస్తున్నారు. ఏప్రిల్ 28న బెంగుళూరు బందుకు పిలుపునిచ్చారు కూడా. తాజాగా మద్రాస్ హైకోర్టులో సినిమా రిలీజ్ నిలిపి వేయాలని పిటీషన్ దాఖలైంది.


ముందు అప్పులు కట్టండి

ముందు అప్పులు కట్టండి

తనకు రావాల్సిన అప్పులు చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేయాలని, అప్పటి వరకు మూవీ రిలీజ్ ఆపాలని తమిళ సినీ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చే'సినట్లు తెలుస్తోంది.


400 కోట్ల సినిమాకు రూ. 1.18 కోట్ల అప్పా?

400 కోట్ల సినిమాకు రూ. 1.18 కోట్ల అప్పా?

దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కేవలం 1.18 కోట్ల అప్పుతో కోర్టు ఇబ్బందుల్లో పడటం చర్చనీయాంశం అయింది. అయితే ఇది బాహుబలి నిర్మాతలు చేసిన అప్పు కాదు. తమిళంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ‘కె ప్రొడక్షన్స్' వారు బాకీ ఉండటంతోీ పిటీషన్ దాఖలైంది.అయితే బాహుబలి-2 విడుదలపై స్టేకు మద్రాస్‌ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.


కట్టప్ప క్షమాపణ చెబితేనే బాహుబలి 2 రిలీజ్

కట్టప్ప క్షమాపణ చెబితేనే బాహుబలి 2 రిలీజ్

కర్నాటక-తమిళనాడు కావేజీ జలాల వివాదంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ...కట్టప్ప (సత్యరాజ్) కన్నడిగులకు క్షమాపణ చెప్పకపోతే బాహుబలి-2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదని కన్నడ సంఘాల సమాఖ్య సంచాలకుడు వాటాళ్ నాగరాజ్ స్పష్టం చేశారు. సత్యరాజ్ నటించిన సినిమా అయినందునే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటున్నామని, మరే కారణం లేదని అంటున్నారు. కట్టప్ప క్షమాపణ చెప్పక పోతే ఏప్రిల్ 28వ తేది బెంగళూరు బంద్ నిర్వహిస్తామన్నారు.


బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మేకర్స్

బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మేకర్స్

అమెరికన్ పాపులర్ డ్రామా సిరీస్.... 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మేకర్స్ బాహుబలి సినిమాకు గాను ప్రభాస్ డెడికేషన్ చూసి ముగ్దులయ్యారని, అతడిపై ప్రశంసలు గుప్పించారని తెలుస్తోంది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

రాజమౌళి సినిమాల గురించి అందరికీ తెలుసు కానీ.... ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. తాజాగా ఐడ్రీమ్ మీడియా వారి హాట్ టు హాట్ విత్ ప్రేమ ఇంటర్వ్యూలో రమారాజమౌళి తమ జీవితానికి సంబంధించి ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


అంత సీన్ లేదు: ప్రభాస్ పెళ్లి గురించి అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్

అంత సీన్ లేదు: ప్రభాస్ పెళ్లి గురించి అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్

బాహుబలి ప్రాజెక్టు కోసం తన కెరీర్ ను పనంగా పెట్టిన హీరో ప్రభాస్.... ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అనుష్క స్పందించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Tamil film distributor Saravanan file a petition against Baahubali 2 release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu