»   » సంక్రాంతి పండగ సంబరాలకు దూరంగా పవన్ కళ్యాణ్!

సంక్రాంతి పండగ సంబరాలకు దూరంగా పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి పండగ సంబరాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండబోతున్నారు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న ఆయన త్వరగా సినిమా పూర్తి చేయాలని సంక్రాంతికి హాలిడే కూడా తీసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాకు పని చేస్తున్న మిగతావారు కూడా పండగ సంబరానికి దూరం కావాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. జనవరి 5న మొదలైన ఈ షూటింగ్ ఈ నెల చివరి వారం వరకు ఇక్కడే జరుగనుంది.

పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా సెట్స్ నుండి కొన్ని ఫోటోలు విడుదలైంది. బైక్ మీద అలీ...అలీ మీద గబ్బర్ సింగ్...... చూడటానికి ఈ ఫోటో ఆసక్తికరంగా ఉంది. సినిమా ప్రమోషన్లో భాగంగానే ఈ ఫోటో రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ తన కో స్టార్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనే సంగతి తెలిసిందే.


పవన్ కళ్యాణ్ సినిమాలో అలీ తప్పకుండా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుండో ఈ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. అలీ తన సినిమాలో లేకపోతే ఏదో తెలియని వెలితిగా ఫీలవుతానని, అతను పక్కనుంటే ధైర్యంగా వుంటుందని గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.


Sardaar Gabbar Singh shooting will continue on Sankranthi

కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్. 20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.

English summary
Sardaar Gabbar Singh shooting will continue on Sankranthi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu