Just In
- 53 min ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 1 hr ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 1 hr ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 2 hrs ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- Sports
SRH vs RCB: ఔటైన అసహనం.. కుర్చీపై విరాట్ కోహ్లీ కోపం! వీడియో
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
- News
కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రీను వైట్ల అంతుచూస్తా అన్నాడు.. నేనే ఉంటేనా! 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఆగడు' మూవీ అనుకున్న రీతిలో ఆకట్టుకోకపోగా, అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ శ్రీను వైట్ల తనను.. నీ అంతుచూస్తా అన్నాడని చెప్పాడు 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ అనిల్ రావిపూడి. అలా ఎందుకు అన్నాడనే విషయం కూడా చెప్పాడు అనిల్. ఆ వివరాలు చూద్దామా..

మహేష్ 'ఆగడు'.. అనిల్ రావిపూడి
2014 సంవత్సరం మహేష్ బాబు కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్తున్న సమయంలో 'ఆగడు' సినిమా విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మహేష్ అభిమానుల ఆశలను తలక్రిందులు చేసింది. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా.. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రైటింగ్‌లో భాగమయ్యాడు.

ఆగడు సినిమా ఫ్లాప్.. అనిల్ రావిపూడి కామెంట్స్
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియో ద్వారా జనం ముందుకొచ్చిన అనిల్ రావిపూడి.. ఆగడు సినిమా ఫ్లాప్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆగడు సెకండాఫ్ స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే.. తాను పటాస్ సినిమాతో బిజీగా ఉన్నానని, ఆ కారణంగా కొన్ని విషయాలు శ్రీను వైట్లతో డిస్కస్ చేద్దామనుకున్నా ఆ సమయం దొరకలేదని అన్నాడు అనిల్.

వెళ్లిపోయావ్‌గా.. నీ అంతు చూస్తా అన్నాడు
అదే సమయంలో నా 'పటాస్' సినిమా స్టార్ట్ కావడంతో తాను అటే వెళ్లిపోవడం జరిగిందని చెప్పాడు అనిల్. దీంతో ఇప్పటికీ శ్రీను వైట్ల గారు తనతో అప్పుడప్పుడూ ''ఏమయ్యా నాతో సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్లిపోయావ్ నీ అంతు చూస్తా'' అని అంటుంటారని అనిల్ చెప్పాడు. ఈ విషయంలో తనకు బాధగానే ఉందని, తాను శ్రీను వైట్ల గారి కోసం కాస్త సమయం కేటాయించి ఉంటే ‘ఆగడు' మంచి హిట్ అయ్యేదని అనిల్ పేర్కొన్నాడు అనిల్ రావిపూడి.

మహేష్, అనిల్.. 'సరిలేరు నీకెవ్వరు'
ప్రస్తుతం అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. కలర్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి కీలకపాత్ర పోషించింది.