»   » విడాకులివ్వకుండా మరో పెళ్లా? ప్రముఖ నటి సరిత ఆగ్రహం, భర్తపై చట్టపరంగా చర్యలు

విడాకులివ్వకుండా మరో పెళ్లా? ప్రముఖ నటి సరిత ఆగ్రహం, భర్తపై చట్టపరంగా చర్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'మరో చరిత్ర' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సరిత, కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'అర్జున్' సినిమాలో ఆయనకు అత్త పాత్రలో నటించింది. కాగా....ప్రస్తుతం సరిత వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. సరిత భర్త, మళయాల నటుడు ముఖేష్ విడాకులు ఇవ్వకుండానే మిథిలీ దేవికా అనే యువతిని రెండో పెళ్లి చేసుకోవడం ఆమెను షాక్‌కు గురి చేసింది.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న సరిత మాట్లాడుతూ....'తన నుంచి చట్టపరంగా విడాకులు పొందకుండానే భర్త ముఖేష్‌ మాధవన్‌ మరో వివాహం చేసుకున్నాడని, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని సరిత అంటున్నారు. ఈ మేరకు తన భర్తపై చట్టపరంగా ప్రొసీడ్ అవుతాను అని' వెల్లడించారు.

Saritha calls Mukesh's marriage illegal

'ఆయన కారణంగా పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం అయ్యాను. మంచి పాత్రలు చేయడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎన్నో గొప్ప అవకాశాలు మిస్సయ్యాను. విపరీతంగా మద్యం తాగేవాడు. నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఆ ప్రభావం పిల్లలపై కూడా పడేది. అందుకే అప్పట్లోనే ఆయనతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను' ఆమె తెలిపారు.

సరిత చెప్పిన వివరాల ప్రకారం... 1988 ముఖేష్‌ మాధవన్‌తో కేరళలో సరిత వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 2007లోనే ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ సరిత కోర్టుకు వెళ్లగా....ముఖేష్ విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత 2009లో పరస్పర అంగీకారంతో కూడిన విడాకులు కోరుతూ చెన్నరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. అయితే ముఖేష్ కోర్టుకు సరిగా హాజరుకాని కారణంగా....ఆమె ఆ పిటీషన్ 2010లో ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం సరిత ఇద్దరు కుమారులు శ్రవణ్, తేజా్ దుబాయ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారి ఆలనా పాలన చూస్తు వారితో పాటే ఉంటున్నారు సరిత.

English summary
Popular Malayalam actor Mukesh marries the profound dancer Methil Devika. They got married at Mukesh's residence at Maradu and officially signed the marriage papers at the Tripunithara Register Office. Mukesh first wife Saritha calls Mukesh's marriage illegal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu