Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- News
అన్నెం సాయిపై మరో కేసు నమోదు..
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
#SVPFakeCollections: సర్కారు వారి పాట కలెక్షన్ల చిచ్చు.. ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య భీకరమైన ఫైట్
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేశాడు. పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే గురువారమే (మే 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. అసలేమైందో మీరే చూడండి!

మహేశ్ నోట ‘సర్కారు వారి పాట’
స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్ పాత్రను పోషించారు.
ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

అత్యధిక బిజినెస్... గ్రాండ్ రిలీజ్
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2150కి పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

టాక్, వసూళ్లతో యూనిట్ హ్యాపీగా
'సర్కారు వారి పాట' మూవీ ఎన్నో అంచనాల నడుమ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు బాగా వచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దీనికి ఫస్ట్ డేన రూ. 45 కోట్లకు పైగా షేర్.. రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉందనే చెప్పాలి.
గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

డిజాస్టర్ అంటూ ట్రోల్స్‌తో ఫైట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో DisasterSVP అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో ఈ సినిమా డిజాస్టర్ అయిందని చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూ ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై దాదాపు 50 వేలకు పైగా ట్వీట్లు కూడా పోస్ట్ అయ్యాయి.

ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్రోలింగ్
మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ మొదటి రోజు కలెక్షన్ల ద్వారా నాన్ RRR రికార్డులన్నీ బద్దలు కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో యాంటీ ఫ్యాన్స్ మరోసారి రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్లు ఫేక్ అని ట్వీట్లు చేస్తూ SVPFakeCollections అనే హ్యాష్ ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

మెగా ఫ్యామిలీకి మొగుడు అంటూ
'సర్కారు వారి పాట' మూవీకి వ్యతిరేకంగా వస్తున్న ట్వీట్లపై మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ అభిమానులు కూడా MegaFamilyRankuMogudu అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు, మహేశ్ బాబు రికార్డులను ప్రస్తావిస్తూ మెగా హీరోలను ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది.

ఆ సినిమాలకు లేదు.. ఇప్పుడిలా
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా భారీ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ, ఎప్పుడూ ఈ రేంజ్‌లో ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరగలేదు. అయితే, 'సర్కారు వారి పాట' విషయంలోనే ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక, ఈ ఫ్యాన్స్ వార్‌పై చాలా మంది పెద్దలు తప్పుబడుతున్నారు. ఇలాంటి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.