అల్లు అర్జున్ ‘సరైనోడు’ :‘బ్లాక్‌బస్టర్’టార్గెట్..అందుకే ఇది రిలీజ్
హైదరాబాద్: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఆడిపాడిన స్పెషల్ సాంగ్ 'బ్లాక్‌బస్టర్..'. రీసెంట్ గా ఈ సాంగ్ ప్రొమోను ఇటీవల విడుదల చేస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది.
దాంతో చిత్రం యూనిట్ తాజాగా ఈ పాటను పూర్తిగా విడుదల చేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా థమన్ ఈ పాటకు అదిరిపోయే సంగీతం అందించారు. మీరూ ఓ లుక్కేయండి.
యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకూ 141,669 లైక్‌లు లభించాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. కేథరిన్ త్రెసా, శ్రీకాంత్, పనిశెట్టి ఆది, రాహుల్‌వర్మ, విద్యులేఖ రామన్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఏప్రిల్ 1న ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10న విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











