»   » బాలకృష్ణ రికార్డ్ బ్రేక్.... ఆ హీరో ఎవరో తెలిస్తే నమ్మలేరు

బాలకృష్ణ రికార్డ్ బ్రేక్.... ఆ హీరో ఎవరో తెలిస్తే నమ్మలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో బాక్సాఫీస్ వద్ద బొనాంజా సృష్టించాడు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ద్వారా కొన్ని కొత్త రికార్డులను తన పేర రాసుకున్నాడు బాలయ్య. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఒకటిన్నర మిలియన్ డాలర్ల కలెక్షన్లను దాటేసి.. రెండు మిలియన్ల వైపు దూసుకెళ్తున్నాడు శాతకర్ణి.

తెలుగు జాతి కీర్తించిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ నటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1.6 మిలియన్లు కొల్లగొట్టింది. అంతేకాదు బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రం కలెక్షన్లు కూడా దాటిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు యంగ్ హీరో శర్వానంద్.


Sarwanand Beats Balayya in Nizam

సంక్రాంతికి సైలెంట్‌గా వచ్చేసిన శర్వానంద్ శాతకర్ణిని దాటేశాడు. రెండు భారీ సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్ శతమానం భవతి సినిమా నైజాంలో బాలయ్య సినిమా కలెక్షన్లను దాటింది. నైజాంలో రూ.9.3 కోట్ల వసూళ్లు సాధించింది బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే.. బాలయ్య సినిమా కంటే ఒక్క రోజు ఆలస్యంగా విడుదలైన శతమానం భవతి.. రూ.9.4 కోట్ల వసూళ్లను రాబట్టి శాతకర్ణిని వెనక్కు నెట్టింది.


రెండు భారీ సినిమాల మధ్య రిలీజైన చిన్న సినిమా.. వసూళ్ల పరంగా మంచి సక్సెస్‌నే సాధించింది. ఓవర్సీస్ లో చిరు, బాలయ్య సినిమాలు కలెక్షన్స్ భారీగా రాబడుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలకి దీటుగా శతమానం భవతి కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. ప్రీమియర్స్ దగ్గర నుంచి స్టడీ కలెక్షన్స్ రాబద్దుతున్న ఈ సినిమా...మంగళవారంతో హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకుంది.


Sarwanand Beats Balayya in Nizam

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం....ప్రీమియర్స్ తో కలుపుకొని మంగళవారం వరకు ఈ సినిమా 3.58 కోట్లు రాబట్టింది. ఖైదీ, శాతకర్ణి వంటి భారీ సినిమాల పోటీ మధ్య, కేవలం ఐదురోజుల్లోనే అలవోకగా హాఫ్ మిలియన్ క్లబ్ లోకి ఈ సినిమా చేరడం నిజంగా విశేషం. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో....ఇలా వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.

English summary
Shatamanam Bhavathi became successful to grab the attention of family audiences and has beaten the collection record of Balayya’s Gautamiputra Satakarni in Nizam area.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu