For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘శశి లలిత’ ఫస్ట్ లుక్: జయలలిత జీవితంలోని సంచలన విషయాలు వెండితెరపైకి!

  |
  Sasi Lalitha Movie First Look Released By Kethireddy Jagadeeswara Reddy || Filmibeat Telugu

  తెలుగునాట ఎన్టీ రామారావు జీవితానికి సంబంధించి పోటాపోటీగా బయోపిక్స్ రూపొందినట్లే... ఇపుడు తమిళనాట ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంగత నేత జయలలిత జీవితంపై వరుస సినిమాలు రాబోతున్నాయి. ఓ వైపు తమిళ దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో 'తలైవి' మూవీ మొదలవ్వగా, ప్రియదర్శిని దర్శకత్వంలో 'ఐరన్ లేడీ' అనే చిత్రం రాబోతోంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా జయలలిత జీవితంపై రాబోతున్నాయి.

  'లక్ష్మీస్ వీరగ్రంథం' మూవీతో తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సైతం జయలలిత జీవితంలోని ఎవరికీ తెలియని కోణాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో 'శశిలలిత' అనే చిత్రం మొదలు పెట్టారు.

  శశిలలిత ఫస్ట్ లుక్

  శశిలలిత ఫస్ట్ లుక్

  ‘శశిలలిత' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ జగదీశ్వర్ రెడ్డి విడుదల చేశారు. జయలలిత జీవితంలో ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయని, ఆమె బాల్యం నుంచి, ఆమె సినీరంగ జీవితం, వివాద రహితంగా రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా చేసిన సేవల నేపథ్యం ఉంది కాబట్టి ఆమెది ఒక మంచి కథ అనే నిర్ణయానికి వచ్చి ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

  జయలలిత జీవితంలో ఎవరికీ తెలియని కోణాలు

  జయలలిత జీవితంలో ఎవరికీ తెలియని కోణాలు

  జయలలిత మరణించినపుడు 75 రోజుల పాటు ఆసుపత్రిలో జరిగిన ప్రతి సంఘటనను ఆధారం చేసుకుని సుప్రీం కోర్టులో కేసు వేసింది నేను. జయలలిత ఒక సంక్షేమ నేతగా తమిళనాడు ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి ఆమె ఆత్మ ఆదేశం మేరకు శశిలలిత అనే సినిమా నిర్మిస్తున్నాను. ఇందులో సరికొత్త కోణం చూడబోతున్నారు. జయలలిత జీవితంలో ప్రజలకు తెలియని యదార్ధ సంఘటనలు ఇందులో చూపించబోతున్నాం. ఆమె బాల్యం, సినీ జీవితం, స్ట్రగులింగ్, శోభన్ బాబుతో లవ్ ఎఫైర్ అన్ని సంఘటనలతో.. చివర్లో 75 రోజులు ఆమె ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయం జనాలకు తెలియజేయడంకోసం ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ప్రజాదరణ పొందిన నాయకులకే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అనేది చూపించబోతున్నట్లు జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

  జయలలితగా కాజోల్, శశి కళ పాత్రలో అమలా పాల్

  జయలలితగా కాజోల్, శశి కళ పాత్రలో అమలా పాల్

  ఈ చిత్రంలో జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ నటి కాజోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. శశికళ పాత్రకు అమలా పాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  క్లీన్ ఇమేజ్ ఉన్న కాజోల్ జయలలిత పాత్రకు పర్ఫెక్ట్

  క్లీన్ ఇమేజ్ ఉన్న కాజోల్ జయలలిత పాత్రకు పర్ఫెక్ట్

  జయలలిత పాత్రకు బాలీవుడ్ నటి కాజోల్‌ మాత్రమే ఎందుకనే ప్రశ్నకు జగదీశ్వర్ రెడ్డి నుంచి ఆసక్తికర సమాధానం వస్తోంది. జయలలిత లాంటి ఒక మహానేత జీవితం తెరపై ఆవిష్కరించే క్రమంలో అందుకు అర్హులైన వారినే ఎంచుకోవాలి, ఆ నటులకు క్లీన్ ఇమేజ్ ఉండాలి, నెగెటివ్ షేడ్స్ ఉన్న కంగనా రనౌత్ లాంటి వారితో సినిమా చేస్తే ప్రజలు, అభిమానులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. క్లీన్ ఇమేజ్ ఉన్న కాజోల్ లాంటి వారు అయితేనే జయలలిత పాత్రకు పర్ఫెక్ట్ అని ఆయన చెబుతున్నారు.

  రాజకీయ అవసరాల కోసం లక్ష్మీస్ వీరగంధం తీయడం లేదు

  రాజకీయ అవసరాల కోసం లక్ష్మీస్ వీరగంధం తీయడం లేదు

  ‘లక్ష్మీస్ వీరగ్రంథం' ఎందుకు ఆసల్యం అవుతుందనే అంశంపై జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ... కొందరు చేస్తున్నట్లు రాజకీయ అవసరాల కోసం ఈ సినిమా తీయడం లేదని, నిజాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశ్యంతో తీస్తున్నాము. కొన్ని కొత్త విషయాలు సినిమాలో యాడ్ చేసే క్రమంలో రీషూట్లు జరిగాయి. దీనికి తోడు ఎన్నికల కోడ్ ఉండటం కూడా ఓ కారణం. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు.

  English summary
  Kethireddy Jagadeeswara Reddy ,Tamil Nadu Telugu Yuvasakthi president and director, has going to approach Kajol Devgn to play the role of J Jayalalithaa, while Amala Paul for the character of Jaya's close aide Sasikala, who is now serving her four-year imprisonment in the disproportionate case, in the movie called SASI LALITHA .
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more