»   » కట్టప్ప బాగానే హ్యాండిల్ చేసాడు: రెస్పెక్ట్ స‌త్య‌రాజ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్

కట్టప్ప బాగానే హ్యాండిల్ చేసాడు: రెస్పెక్ట్ స‌త్య‌రాజ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడో తొమ్మిదేళ్ళ కిందట కావేరీ జలాల వినియోగంపై నటుడు సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు కర్నాటక ప్రజల్ని హర్ట్‌ చేసాయి. దాంతో అతడు నటించిన సినిమాలని కర్నాటకలో విడుదల కానీయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఏప్రిల్‌ 28న కర్నాటకలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని అన్నారు.

సత్యరాజ్ క్షమాపన

సత్యరాజ్ క్షమాపన

ఇప్పటికే ఏప్రిల్‌ 28న కర్నాటక బంద్‌ కూడా తలపెట్టారు నిరసనకారులు. ఆ సమయం లో సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపన చెప్పటానికి కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటు తమిళ ప్రేక్షకుల మనోభావాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ "సారీ" ప్రహసనం లో ఏమాత్రం తడబడ్డా వెంటనే తమిళనాడు లోనూ వ్యతిరేకత మొదలవుతుంది.


ఎవ్వరి నీ తగ్గించకుండా

ఎవ్వరి నీ తగ్గించకుండా

ఇంకా ఎక్కువ హర్ట్ అయితే ఇక్కడ కూడా బాహుబలి రిలీజ్ కి చిక్కులు రావొచ్చు కానీ ఇక్కడే చాలా సమయ స్పూర్థితో వ్యవహరించాడు కట్టప్ప. ఎవ్వరి నీ తగ్గించకుండా ఇటు కన్నడ అటు తమిల ప్రజల ఈగో లని సాటిస్ఫై చేయగలిగాడు. తనవల్ల వచ్చిన సమస్యని తానే పరిష్కరించాడు.


 ఏమాత్రం తడబడలేదు

ఏమాత్రం తడబడలేదు

మొదటినుంచీ ఈ సారీ విషయం లో సుముఖంగా లేని సత్యరాజ్ దాదాపు 50 కోట్ల వ్యాపారం మొత్తం తన ‘సారీ'తో ముడిపడి ఉండటంతో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ కూడా ఏమాత్రం తడబడలేదు సత్యరాజ్ ఇరు పక్షాలనీ సంతృప్తి పరిచేలా వ్యవహరించాడు.


ఇప్పుడు తాను సారీ చెప్పినా

ఇప్పుడు తాను సారీ చెప్పినా

కన్నడిగులకు సారీ చెబుతూనే.. తమిళ జనాలు హర్టవకుండా.. తనను అపార్థం చేసుకోకుండా బ్యాలెన్సింగ్ గా మాట్లాడటంలో సత్యరాజ్ తన పరిణతి చూపించాడు. చివరలో ఇప్పుడు తాను సారీ చెప్పినా తమిళ ప్రయోజనాలే తనకు ముఖ్యమని.. చెప్పిన కట్టప్ప తమిళ ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరో మాట చెప్పాడు.


అవకాశాలు రాకపోయినా పర్వాలేదు

అవకాశాలు రాకపోయినా పర్వాలేదు

కావేరీ వివాదంలో తన స్టాండ్ మారదని.. తన పోరాటం కొనసాగుతుందని.. ఈ క్రమంలో తనకు సినిమాల్లో అవకాశాలు రాకపోయినా పర్వాలేదని అనడం తో తమిళ ప్రజలనుంచి వ్యతిరేకథని అడ్డుకోవటమే కాకుండా తనమీద మరింత అభిమానం పెరిగేలా చూసుకున్నాడు.


 రెస్పెక్ట్ స‌త్య‌రాజ్

రెస్పెక్ట్ స‌త్య‌రాజ్

దాంతో సీన్ రివర్స్ అయ్యింది తమిళులు కూడా సత్యరాజ్ ప్రకటనని పూర్తిగా ఆమోదించారు. క‌న్న‌డిగుల‌కు సారీ చెబితే.. త‌మిళుల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుందేమో అనుకుంటే.. ఇప్పుడు ఆయ‌న‌పై వారి అభిమానం మ‌రింత పెరిగింది. రెస్పెక్ట్ స‌త్య‌రాజ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మ‌రీ త‌మిళ జ‌నాలు ఆయ‌న్ని తెగ పొగిడేస్తున్నారు.


ఇమేజ్ దెబ్బ తినకుండా

ఇమేజ్ దెబ్బ తినకుండా

మొత్తానికి కన్నడిగుల ఈగోను శాటిస్ఫై చేస్తూనే.. తమిళ నాట తన ఇమేజ్ దెబ్బ తినకుండా చూసుకున్నాడు సత్యరాజ్. ఈ వివాదానికి సత్యరాజ్ ఇలా ముగింపు పలుకుతాడని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే ముందుగా సత్య రాజ్ కాకుండా జక్కన్నే ముందడుగు వేసాడు. తన సినిమాకీ ఈ రెండు రాష్ట్రాల వివాదానికీ సంబందం లేదు కదా ఒక నటుడి మీద కోపం తో ఇలా ఒక సినిమాని దెబ్బతీయటం భావ్యమేనా అంటూ కన్నడ ప్రేక్షకులని కొంచం కూల్ చేసాడు.
 కన్నడ నాయకులు

కన్నడ నాయకులు

ఐతే సత్యరాజ్ ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యల్ని పట్టుకుని.. వివాదాన్ని రాజేసి ఆ మంటలో తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూసిన కన్నడ నాయకులు ఇప్పుడేం చేస్తారన్నది ఆసక్తికరం. ఏవైనా మరిన్ని సమస్యలు సృష్టిస్తారా లేక ఈ సారీ తో సంతృప్తి పడి బాహుబలి ని అడ్డుకోకుండా వదిలేస్తారా అన్నది చూడాలి...
English summary
Baahubali 2's 'Kattappa' Sathyaraj has apologised to Kannadigas and requested them to support Baahubali 2's release. Will this end the protest against SS Rajamouli film in Karnataka?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu