»   » మెగాస్టార్ ని గుక్క తిప్పుకోనివ్వని సెటైర్లతో హింస పెడుతోన్న హీరో..?

మెగాస్టార్ ని గుక్క తిప్పుకోనివ్వని సెటైర్లతో హింస పెడుతోన్న హీరో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవిని అన్నయ్య అంటు కూడా తిరిగిన శ్రీకాంత్ ఇప్పుడు ఆ చుట్టు పక్కల కూడా కనిపించడంలేదు. చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచీ శ్రీకాంత్ మునుపటిలా చిరంజీవితో కలిసుండడంలేదు. దానికి తోడు శ్రీకాంత్ ఓ భూ వివాదంలో చిక్కుకుని కాంగ్రెస్ నేత కాకా వల్ల ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి కనీసం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో తనకి బాలకష్ణ అండగా నిలబడి, హరికృష్ణ, దాసరి నారాయణ రావు కి వివరించి వారి ద్వారా ప్రాబ్లంను సాల్వ్ చేయడంతో శ్రీకాంత్ చిరంజీవికి పూర్తిగా దూరమాయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ వరుసగా రాజకీయ ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయా చిత్రాల్లో చిరంజీవిపై శ్రీకాంత్ మెరుపు దాడి చేస్తాడని, మెగాస్టార్ ని గుక్క తిప్పుకోనివ్వని సెటైర్లతో హింస పెడతాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో శ్రీకాంత్ కే తెలియాలి. అంతే కాకుండా ప్రస్తుతం బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న శ్రీరామ రాజ్యం" సినిమాలో బాలయ్యకు బ్రదర్ గా లక్ష్మణుడిగా నటిస్తున్నాడు.

English summary
Market sources easily observe that after Chiru entering the politics, Srikanth distanced safely from his Annayya for the reasons unknown. Srikanth even missed to attend all the family and professional functions of Chiru, where Srikanth normally used to be the front runner from filmy personalities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu