For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?.. ప్రతీ ఒక్క మెగా అభిమానిని కదిలించే హీరో కథ

  |

  తెలుగు సినీ చరిత్రలో చిరంజీవిది ఓ స్వర్ణయుగం. దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ను అప్రతిహతంగా ఏలేస్తున్నాడు. మరీ ముఖ్యంగా 80, 90 దశకంలోని వారికి చిరంజీవే ఆరాధ్య దైవం. ఆయన్ను చూసే ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి వేషాల కోసం వచ్చారు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో దాదాపు అందరూ చిరంజీవి అభిమానులే. ఆయన్ను అనుసరించే సినిమా బాట పట్టి ఉంటారు. అందులో విలక్షణ నటుడు సత్యదేవ్ కూడా ఒకడు. ఆయన జీవితంలో చిరంజీవి పాత్ర ఎంతటిదో తాజాగా చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా చిరంజీవిని కలవడంతో గాల్లో తేలిపోతోన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అందమైన కథ, స్ఫూర్తివంతమైన కథను చెప్పుకొచ్చాడు.

   మొదటగా అలా..

  మొదటగా అలా..

  సత్య దేవ్ తన చిన్ననాటి విషయాలను చెబుతూ.. ‘నా చిన్నప్పుడు మా క్లాస్ రూం గోడ మీద ఒక పెద్ద స్కేల్ బొమ్మ ఉండేది. ఆరడుగుల దాక గీసి ఆపేశారు. రెండు మూడు నెలలకొకసారి ఎంత పొడవు పెరిగామో కొలవటానికి ఒక్కొక్కరినీ గోడకు ఆనుకుని నిలబడమనేవారు. ఒకరోజు మా టీచర్‌ని ‘మాలో ఎవరైనా ఆ సీలింగ్ కన్నా పొడవు పెరిగితే ఎలా టీచర్‌?' అని అడిగాను. అప్పుడు మా టీచర్ అడిగిన ప్రశ్న.. ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?'.

   ప్రతీచోటా అదే మాట..

  ప్రతీచోటా అదే మాట..

  ఆ తరువాత చాలా సార్లు, చాలా చోట్ల అవే మాటలు విన్నాను. కష్టతరం, అసాధ్యం, అనిపించే పనులు చేయటానికి ఎవరు పూనుకున్నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు అనే మాటలు అవి. నేను సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు నాకు మళ్లీ అదే ప్రశ్న ఎదురుపడింది. ‘నేను చిరంజీవిని' అనుకోలేదు. కొన్ని కోట్ల మంది లాగా చిరంజీవి అవ్వాలనుకున్నాను.

   శిఖరం మీద జెండా..

  శిఖరం మీద జెండా..

  నేను ఎమి సాధించాను.. ఎంత సాధించాలి అని కొలవడానికి నా లైఫ్ గోడ మీద నేను గీసుకున్న స్కేల్ చిరంజీవి. ఎవరెస్ట్ ఎక్కటానికి బయలుదేరిన ప్రతి ఒక్కడికీ అనుమానాలు, భయాలూ తప్పవు. దారిలో ఊహించని అడ్డంకులు, కుంగదీసే గాయాలు ఇక నా వల్ల కాదు అని వెనక్కి తిరిగి పోవాలనుకున్నప్పుడు ఆ శిఖరం మీద ఉన్న జెండా కనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం వస్తుంది. శక్తి పుంజుకుని మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాం.

   భద్రంగా దాచుకుంటాను..

  భద్రంగా దాచుకుంటాను..

  తెలుగు సినిమాల్లోకి నటుడవ్వాలని వచ్చిన నాలాంటి వేల మందికి చిరంజీవి అన్న వ్యక్తి ఆ జెండా. మొన్న జూలై 8న చిరంజీవి గారిని వాళ్ల ఇంట్లో కలివాను. ఆ యూఫోరియా నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కలలానే ఉంది. సర్ మీరు నాకు చెప్పిన ప్రతి మాటా గుర్తుంది. భద్రంగా నా మనసులో దాచుకుంటాను. ‘చిరంజీవి గారిని కలవటానికి వెళ్తున్నాను' అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ల నుంచి అదే ప్రశ్న.. ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?'' అంటూ ఎంతో స్ఫూర్తిని నింపే తన కథను వివరించాడు.

  Recommended Video

  Disco Raja Movie Review & Rating || Filmibeat Telugu
   నేను ఊహించగలను..

  నేను ఊహించగలను..


  ఇక సత్యదేవ్ తన భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. పూరి జగన్నాద్ స్పందించాడు. ‘అన్నయ్య నిన్ను ఎంత ఇన్‌స్పైర్ చేసుంటారో నేను ఊహించుకోగలను. రాసిపెట్టుకో ఆ మీటింగ్ నీ జీవితాన్నే మార్చేస్తుంద'ని చెప్పుకొచ్చాడు.

  English summary
  Satya Dev About Meeting chiranjeevi. On July 8th, 2020 I had the extreme privilege of meeting my Idol and the reason behind my aspiration to become an actor Megastar 'annaya' Chiranjeevi garu My thoughts...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X