twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ తారల మద్దతుతో ముదురుతున్న #SaveNallamala ఉద్యమం!

    |

    Recommended Video

    Anasuya Bharadwaj Fires On Netizens || ఎమోషనల్ అయిన అనసూయ

    #SaveNallamala ఉద్యమం రోజు రోజుకు బలపడుతోంది. పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినిమా తారలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో వారి అభిమానులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. దీంతో ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. ట్విట్టర్లో #SaveNallamala టాప్ ట్రెండింగ్ అంశంగా ఉంది.

    తెలంగాణ ప్రాంతంలో దాదాపు 20 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాల కోసం ప్రయత్నాలు మొదలైన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరేనియం తవ్వకాలు మొదలైతే భూమి, నీరు కాలుష్యం అవుతుందని, ఇది మనుషులపైనే కాకుండా జంతు, వృక్షజాలంపై తీవ్రం ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

    హీరో రామ్ ట్వీట్

    ఇప్పటికే పవన్ కళ్యాణ్, శేఖర్ కమ్ముల, విజయ్ దేవరకొండ, అనసూయ లాంటి వారు #SaveNallamala ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తాజాగా ఈ లిస్టులో తెలుగు హీరో రామ్ చేరారు. కామన్ మ్యాన్ తరుపున తాను స్పందిస్తున్నట్లు వెల్లడించారు.

    బాలీవుడ్ నటుడు కూడా...

    బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా కూడా దీనిపై స్పందించారు. ‘‘మనకు అభివృద్ధి అవసరమే.. కానీ దానికి మూల్యం ఏమిటి? యూరేనియం మైనింగ్ కేవలం అడవులను నాశనం చేయడం మాత్రమే కాదు, ఇది నేల, వృక్షజాలం, జంతుజాలాలను కలుషితం చేస్తుంది .. వ్యర్థాలు నదులలోకి వెళ్లి మైళ్ళ వరకు వ్యాపించి వేలాది మందిని ప్రభావితం చేస్తాయి.'' అని ట్వీట్ చేశారు.

    మంచు మనోజ్

    యురేనియం మైనింగ్ ఏపీ, తెలంగాణలోని పర్యావరణ వ్యవస్థపై చాలా తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అమెజాన్‌లో జరిగిన అంశంపై మనం గొంతు వినిపించాము. ఇపుడు మన సొంత నల్లమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యూరేనియం మైనింగ్ ఆపివేయాలి... అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

    వరుణ్ తేజ్

    #SaveNallamala ఉద్యమానికి మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ గళం విప్పడంతో ఇతర మెగా హీరోలు కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా, తాజాగా వరుణ్ తేజ్ తన మద్దతు ప్రకటించారు.

    English summary
    #SaveNallamala is trending on Twitter. Apart from Telugu film stars, Bollywood stars have also expressed their support for the movement. People want uranium mining to stop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X