»   » ‘మహానటి’ ఆడియో వేడుకలో భావోద్వేగంతో ఏడ్చేసిన సావిత్రి కొడుకు!

‘మహానటి’ ఆడియో వేడుకలో భావోద్వేగంతో ఏడ్చేసిన సావిత్రి కొడుకు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరరెక్కుతున్న 'మహానటి' ఆడియో వేడుక మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సావిత్రి కూతురు విజయ, కుమారుడు సతీష్ కూడా హాజరయ్యారు. తమ తల్లి జీవితంపై తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మాట్లాడటానికి స్టేజీ పైకి వచ్చి ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా మొదలు పెట్టే ముందు దర్శకుడు తనకు కథ చెప్పారని, అపుడు తనకు కన్నీళ్లు ఆగలేదని, ఆయన స్టోరీ చెబుతుంటే 30 సార్లు ఏడ్చేశాను అని సతీష్ వెల్లడించారు.

  Mahanati Audio Launch:savitri Family Emotional speech
  ఇదేదో ట్రాజెడీ స్టోరీలా ఉంటుంద‌ని భ‌య‌ప‌డ్డాను

  ఇదేదో ట్రాజెడీ స్టోరీలా ఉంటుంద‌ని భ‌య‌ప‌డ్డాను

  ఈ సందర్భంగా సావిత్రి కుమారుడు సతీష్ మాట్లాడుతూ.... ఈ బ‌యోపిక్ చేస్తున్నార‌ని తెలియ‌గానే నేను ఇదేదో ట్రాజెడీ స్టోరీలా ఉంటుంద‌ని భ‌య‌ప‌డ్డాను. నాగాశ్విన్ గారిని కథ చెప్పమని అడిగాను. ఆయన ఫోన్లో కథ చెప్పడం మొదలు పెట్టారు, ఆయన స్టోరీ విన్న తర్వాత తనలో ఉన్న భయం పోయిందని తెలిపారు.


  బయోపిక్ గురించి ఇలా కూడా తీయవచ్చా? ఏడ్చేశాను...

  బయోపిక్ గురించి ఇలా కూడా తీయవచ్చా? ఏడ్చేశాను...

  నాగ్ అశ్విన్ కథ చెబుతుంటే నేను కొన్ని ప్రశ్నలు నేను వేయడం, ఆయన సమాధానాలు చెప్పడం జరిగింది. కథ చెబుతుంటే మనం ఊ కొట్టాలి కదా... కానీ మధ్య మధ్యలో నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడప్పుడు నాగాశ్విన్ గారు... సతీష్ గారు మీరు ఉన్నారా? వినిపిస్తుందా? అని అడుగుతా ఉండేవారు. అలా నేను సైలెంట్ అయిపోవడానికి కారణం ఆయన చెబుతున్న కథ విని భావేద్వాగినికి గురి కావడమే. ఆపుడు నా కంట్లో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఒక 30 సార్లు ఏడ్చేశాను. అవి బాధతో వచ్చిన కనీళ్లు కాదు. ఇలా కూడా ఆలోచించవచ్చా? ఇలా కూడా సినిమా తీయవచ్చా? అని భావోద్వేగానికి గురయ్యాను... అని సతీష్ తెలిపారు.


   అమ్మ‌నాన్న క‌థ ఏంటో అంద‌రితో పాటు చూడాల‌ని

  అమ్మ‌నాన్న క‌థ ఏంటో అంద‌రితో పాటు చూడాల‌ని

  సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ..... ``ఇది చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్. అమ్మ పుట్టిన‌ప్ప‌టి నుండి ఏమేం చేసింద‌నేది అందరికీ తెలిసేలా నాగాశ్విన్ సినిమా చేశారు. ఒక రోజు ఆయన షూటింగుకు తప్పకుండా రావాలని పిలిచారు. ఎందుకు? అని అడిగితే ‘మీరు పుట్టబోతున్నారు' అని చెప్పారు. ఈ సినిమాలో నేను పుట్టిన సీన్‌ను కూడా నేను చూశాను. ఇంత కంటే ఏం కావాలి. సినిమా గురించి ఇంత కంటే ఏం చెప్ప‌లేను. అమ్మ‌నాన్న క‌థ ఏంటో అంద‌రితో పాటు చూడాల‌ని ఎదురుచూస్తున్నాను.... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.


  సావిత్రి ఫ్యామిలీ పరిచయం

  సావిత్రి ఫ్యామిలీ పరిచయం

  ఈ సందర్భంగా సావిత్ర ఫ్యామిలీ మొత్తాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. విజయ చాముండేశ్వరి పిల్లలు, సతీష్ పిల్లలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు.
  English summary
  Savitri's Son Speech at Mahanati Audio Launch. Mahanati is an upcoming biographical period film, based on the life of South Indian actress Savitri, directed by Nag Ashwin and produced by C. Ashwini Dutt for Vyjayanthi Movies. It stars Keerthy Suresh in the titular role, Dulquer Salmaan, Samantha Akkineni, Vijay Devarakonda,Akkineni Naga Chaitanya, Anushka Shetty, Mohan Babu, and Prakash Raj. The film began production in May 2017, and is set to release on 9 May 2018.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more