»   » బాలకృష్ణ ఫ్యాన్స్, వారి కుటుంబ సభ్యులకు స్కాలర్‌షిప్స్‌

బాలకృష్ణ ఫ్యాన్స్, వారి కుటుంబ సభ్యులకు స్కాలర్‌షిప్స్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పైసా వసూల్‌'. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా హీరోగా బాలకృష్ణకు 101వది. ఈ సందర్భంగా భవ్య క్రియేషన్స్‌ 'పైసా వసూల్‌' సినిమా విడుదల సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని బాలకృష్ణ అభిమానులు, అభిమానుల కుటుంబ సభ్యుల్లోని పదో తరగతి, ఇంటర్‌ చదువుతున్న 101మంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు తమ హీరో నందమూరి బాలకష్ణగారి పేరు మీద స్కాలర్‌షిప్స్ ఇవ్వాలని నిర్ణయించింది.

బాలకృష్ణ అభిమానులు, అభిమానుల కుటుంబ సభ్యులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందేందుకు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు ఇవ్వవలసి ఉంటుంది. అయితే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఇన్‌కమ్‌ సర్టిఫికేట్, వైట్‌ రేషన్‌ కార్డ్, స్కూల్‌ లేదా కాలేజ్‌ స్టడీ సర్టిఫికేట్‌ మరియు మార్క్స్ మెమోలను సదరు దరఖాస్తుకు జత చేయవలసి ఉంటుంది. దరఖాస్తులను అందజేయడానికి ఆగస్టు 10 ఆఖరు తేదీ.


ఈ కింది జాబితాలోని బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షులను ఆయా జిల్లాలకు చెందిన దరఖాస్తుదారులు ఫోనులో సంప్రదించి, తమ దరఖాస్తులను వారికి అందజేయాల్సి ఉంటుంది.


ఒక్కొక్కరికి రూ. 10 వేలు స్కాలర్‌షిప్

ఒక్కొక్కరికి రూ. 10 వేలు స్కాలర్‌షిప్

ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. అయితే... అభిమాన సంఘాల అధ్యక్షులు పంపించిన జాబితా నుంచి తుది జాబితను భవ్య క్రియేషన్స్‌ వారు ఎంపిక చేస్తారు.


Balakrishna's Paisa Vasool Stumper Release Date Confirmed
బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు

బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు

తెలంగాణ: (పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం)


1.హైదరాబాద్‌- శర్మ - 9848129904
2. రంగారెడ్డి- రాజు - 9396699955
3. ఆదిలాబాద్‌- ఖాజా మియా -9866312888
4. మహబూబ్‌నగర్‌- ఆర్‌. బాలప్ప - 9346389045
5. ఖమ్మం- టి. శ్రీనివాస్‌ -9059393778
6. నల్గొండ- బి.శ్రీనివాస్‌ -9848259288
7. నిజమాబాద్‌- మల్లిఖార్జున్‌-9848652281- 9010016405
8. కరీంనగర్‌- ఎస్‌. రాజేష్‌- 9849539015,9182117962.
9. వరంగల్‌- సాగంటి ప్రకాశ్‌- 9963641335
10. మెదక్‌- పరమేశ్వర్‌-9010937001


నవ్యాంధ్రప్రదేశ్‌:

నవ్యాంధ్రప్రదేశ్‌:

1. నెల్లూరు- సుధాకర్ -9347101378


2. ప్రకాశం- వాసు- 7893445333
3. గుంటూరు- హనుమంత్‌రావు-9949474555
4. కృష్ణ- నిమ్మగడ్డ ప్రసాద్‌ -9573295555
5. పశ్చిమగోదావరి -శ్రీను- 9849828755
6. తూర్పుగోదావరి -ప్రసాద్‌- 9849893951
7. వైజాగ్‌- పైడి రాజు- 9393110651
8. విజయనగరం- భాస్కర్‌ -8886098895
9. శ్రీకాకుళం- వెంకటేష్‌-9390612106
10.కడప - పేరయ్య - 9440990479
11. చిత్తూరు - నరసింహ నాయుడు - 9440872700
12. అనంతపురం - గౌస్ - 9440780188
13. కర్నూల్ - సుధాకర్ నాయుడు - 9440768962అభిమానులతో నిర్మాత ఆనంద ప్రసాద్-దర్శకుడు పూరి జగన్నాథ్ భేటీ

అభిమానులతో నిర్మాత ఆనంద ప్రసాద్-దర్శకుడు పూరి జగన్నాథ్ భేటీ

101 మంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేస్తున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల నందమూరి బాలకృష్ణఅభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లతో భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద ప్రసాద్, దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లో సమావేశమయ్యారు.


ఆనందంగానూ, గర్వంగా ఉందన్న నిర్మాత

ఆనందంగానూ, గర్వంగా ఉందన్న నిర్మాత

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. అదీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అభిమానులు కోరుకునే 'పైసా వసూల్' వంటి సినిమా తీసినందుకు మరింత సంతోషంగా ఉంది. సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. ఈ సందర్భంగా 101మంది పేద విద్యార్థులకు ఈ సందర్భంగా స్కాలర్‌షిప్స్‌ ఇవ్వాలని నిర్ణయించాము. బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్ల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులోనూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలనేది మా ఆలోచన'' అన్నారు.


ఆలస్యమైందని ఫీలవుతున్నా: పూరి

ఆలస్యమైందని ఫీలవుతున్నా: పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- "ఇన్నేళ్ల తర్వాత బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు హ్యాపీ. కానీ, సినిమా చేసిన తర్వాత ఆయనతో సినిమా చేయడం ఎందుకింత ఆలస్యమైందని ఫీలవుతున్నా. ఆయనతో పనిచేసిన తర్వాత మీరంతా ఎందుకు అభిమానులు అయ్యారనేది అర్థమైంది. జూబ్లీహిల్స్ లో బాలకృష్ణగారికి అభిమాన సంఘం ఉంటే నేనే దానికి అధ్యక్షుడిని అవుతా. అంతగా ఆయనకు నేను అభిమాని అయ్యాను. మళ్ళీ మళ్ళీ బాలకృష్ణగారితో కలసి పనిచేయాలనుకుంటున్నా. తప్పకుండా పనిచేస్తా'' అన్నారు.​
English summary
Paisa Vasool producer V. Anand Pradsad provide Scholarship for Balakrishna fans and their family members. For full details visit nbkpaisavasool.com.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more