అమితాబ్ పేరిట ప్రభుత్వ స్కాలర్ షిప్స్
ముంబై : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పేరిట స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు విక్టోరియా ప్రభుత్వం నిర్ణయించింది. మే నెలలో మెల్‌బోర్న్‌లో జరుగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమితాబ్ బచ్చన్ పేరిట పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌ను ప్రదానం చేయనున్నారు. ఇప్పటిదాకా చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్ పేరు మార్మోగింది. ఇక విద్యారంగంలోనూ బిగ్‌బీ తనదైన పాత్రను పోషించనున్నారు.
మే నెలలో అమితాబ్ లాట్రోబ్ విశ్వవిద్యాలయం గ్లోబల్ సిటిజన్ అవార్డును సైతం అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జాన్ దివార్ వెల్లడించారు. అమితాబ్‌కు ఈ అవార్డును ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలువురి హృదయాలను బిగ్‌బీ కొల్లగొట్టారని ఆయన పేర్కొన్నారు. లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలో చదివే భారతీయ విద్యార్థులకు అమితాబ్ పేరిట స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. మెల్‌బోర్న్‌లో భారతీయ చలనచిత్ర ఉత్సవం మే 3 నుంచి 22 వరకు జరుగనుంది. ఈ ఉత్సవానికి బిగ్‌బీ హాజరు కానున్నారు.


Click it and Unblock the Notifications












