»   » ‘కబాలి’ లగ్జరీ షోలు రద్దు, నిబంధనలకు విరుద్ధం... డబ్బులు వెనక్కి!

‘కబాలి’ లగ్జరీ షోలు రద్దు, నిబంధనలకు విరుద్ధం... డబ్బులు వెనక్కి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: రజనీకాంత్ 'కబాలి' మూవీకి ఎంత క్రేజ్ వచ్చిందో కొన్ని రోజులుగా చూస్తున్నాం. 'కబాలి' సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి బెంగుళూరులోని కొన్ని స్టార్ హోటళ్లు కూడా ప్లాన్ చేసాయి. తమ తమ హోటళ్లలో ఖరీదైన సదుపాయాల మధ్య 'కబాలి' షోలను ఏర్పాటు చేసాయి. దాదాపు నాలుగు స్టార్ హోటళ్లు 300 నుండి 500 కెపాసిటీతో స్క్రీనింగుకు ఏర్పాట్లు చేసాయి. సూపర్ స్టార్ సినిమాను మరింత సూపర్ లగ్జరీగా చూడాలంటూ ప్రకటనలు గుప్పించారు. కొందరు డబ్బున్న అభిమానులు ఆయా స్టార్ హోటళ్లలో భారీ ధరలకు టిక్కెట్లు సైతం కొనుగోలు చేసారు.

అయితే ఇపుడు ఈ షోలకు బ్రేక్ పడింది. నిబంధనలకు విరుద్ధం కావడంతో అధికారులు ఇందుకు అనుమతి ఇవ్వలేదు. ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని బెంగళూరు అర్బన్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.శంకర్‌కు డిస్ట్రిబ్యూటర్స్‌ దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో సినిమా విడుదల చేయకూడదని ఆ దరఖాస్తును తిరస్కరించారు.


Screening of Kabali in five-star hotels cancelled

కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, కర్ణాటక స్టేట్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్లు హోటల్స్ లో సినిమా విడుదల చేయడాన్ని ముందు నుండి వ్యతిరేకిస్తున్నారు. సీబీఎఫ్‌సీ నిబంధనలకు అది పూర్తిగా విరుద్ధమని, కబాలి విషయంలో ఇలాంటి అనుమతి ఇస్తే ఇకపై అన్ని సినిమాలు ఇలానే రిలీజ్ అవుతాయి, భవిష్యత్తులో మరో అడుగు ముందుకేసి ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా సినిమాహాళ్లను ఏర్పాటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసారు.


కర్ణాటక సినిమా చట్టం, కర్ణాటక సినిమాస్‌ నిబంధనల ప్రకారం కేవలం థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే సినిమాలు విడుదల చేయాలి. దీంతో కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న స్టార్ హోటళ్ల ఉపాయానికి బ్రేక్ పడినట్లయింది. అయితే ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని హోటల్‌ యాజమాన్యాలు ప్రకటించాయి.

English summary
Screening of Kabali in five-star hotels cancelled. The Karnataka Film Chamber of Commerce has quashed all plans of five-star hotels in Bengaluru to screen Kabali at their premises for Thalaivar fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu