»   »  ఆమిర్, షారుక్.. మరో 40 మంది బాలీవుడ్ స్టార్లకు షాక్!

ఆమిర్, షారుక్.. మరో 40 మంది బాలీవుడ్ స్టార్లకు షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్లు ఆమిర్ ఖాన్, షారుక్ సహా.... మరో 40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ముంబై పోలీసులు షాకిచ్చారు. భద్రతను కుదిస్తూ ముంబై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించారు.

సెలెబ్రిటీలకు ముంబై పోలీసులు స్థాయికి మించి భద్రతను కల్పిస్తున్నారని, దీంతో ప్రభుత్వంపై పెను భారం పడుతోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన వార్షిక నివేదికలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నివేదికతో వాస్తవ పరిస్థితులపై సమీక్ష చేసిన ముంబై పోలీసులు బాలీవుడ్ నటులకు అవసరమైన మేరకు మాత్రమే భద్రతను కల్పించాలని భావించినట్లు తెలుస్తోంది.

Security for SRK, Aamir Khan trimmed

అమీర్ ఖాన్ చాలా కాలంగా.....‘ఇంక్రెడిబుల్ ఇండియా'కు కేంద్ర పర్యాటక శాఖ తరుపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా ఇకపై ఆమిర్ ఖాన్ ను తీసుకోవడం లేదని ప్రకటించి షాచ్చింది.... ఆ వెంటనే భద్రత కూడా తగ్గించడం గమనార్హం.

గతంలో ఇండియాలో మతఅసహనం అనే అంశం విషయంలో..... అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నా భార్య ఈ దేశం వదిలి వెళదామంటోంది అంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.

English summary
The Mumbai Police has downgraded the security of around 40 Bollywood celebrities after an annual assessment of threat perception. Actors Shah Rukh Khan, Aamir Khan and producer Vidhu Vinod Chopra are among those whose security has been downgraded
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu