twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీమాంధ్రలోనూ...‘అత్తారింటికి దారేది’ కష్టాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోనే కాదు....సీమాంధ్ర ప్రాంతంలోనూ 'అత్తారింటికి దారేది' చిత్రానికి కష్టాలు తప్పడం లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి సమైక్య ఉద్యమానికి దూరంగా ఉండటం సమైక్యాంధ్ర ఆందోళన కారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. చిరంజీవి తీరుకు నిరసనగానే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాన్ని అడ్డుకుంటున్నామని సమైక్యవాదులు తేల్చి చెబుతున్నారు. విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో సమైక్య ఆందోళన కారులు సినిమాను అడ్డుకుంటున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందే పైరసీకి గురై నిర్మాతకు నష్టాలు తెచ్చే పరిస్థితి తెచ్చింది. ఈ నేపథ్యంలో పుండుమీద కారం చల్లినట్లు అటు తెలంగాణ, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమాల సెగ సినిమాకు దెబ్బమీద దెబ్బ కొట్టినట్లు అవుతోంది. ఈ కష్టాల కడలిని పవర్ స్టార్ సినిమా ఎలా దాటుతుందో అని ఆందోళనలో ఉన్నారు నిర్మాతలు.

    ఈ చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజవుతోంది. వాస్తవానికి ఈచిత్రం అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న ఈ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అవడంతో....త్వరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.

    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    
 After Telangana protests, Seemandhra protests are also trying to stop the Attarintiki Daredi film's screening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X